ర్యాష్‌ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన ఆకతాయిలు.. పోలీసులపైనే విచక్షణా రహితంగా దాడి చేసి దారుణం..

|

Oct 29, 2022 | 4:18 PM

ఈ ఘటనపై కానిస్టేబుల్‌ అశోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు..నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టుగా చెప్పారు.

ర్యాష్‌ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన ఆకతాయిలు.. పోలీసులపైనే విచక్షణా రహితంగా దాడి చేసి దారుణం..
Rash Driving
Follow us on

ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బైక్‌ దొరికితే చాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. తమతో పాటు, ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్‌పై నిలదీసినందుకు ఏకంగా పోలీస్ కానిస్టేబుల్‌పైనే దాడికి ది గారు ఐదుగురు వ్యక్తులు. తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల అశోక్‌, అస్తంపట్టి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డ్యూటీలో లేని అతడు రాత్రి వేళ బైక్‌పై వెళ్తుండగా, ఒక బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తున్నారు. దీంతో అశోక్‌ తన బైక్‌ను ఆపి దీనిపై వారిని నిలదీశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు ఆకతాయిలు.. అశోక్‌పై దాడి చేశారు. మరో ఇద్దరు అనుచరులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆవేశంతో కానిస్టేబుల్‌ని తీవ్రంగా కొట్టారు.

ఈ ఘటనపై కానిస్టేబుల్‌ అశోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు..నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టుగా చెప్పారు. ఈ ఘటనలో అబ్దుల్ రెహమాన్, రికాన్‌పాషా, అస్లాం అలీ, రిజ్వాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ రెహమాన్ కౌన్సిలర్ సదాజ్ కుమారుడిగా తెలిసింది. తదుపరి చర్యల కోసం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి