Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన ప్రియాంక గాంధీ.. మోదీపై షాకింగ్ కామెంట్స్..

రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై ప్రియాంక గాంధీ స్పందించారు. బీజేపీ చర్యలకు తాము భయపడేది లేదని ట్వీట్ చేశారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్ గాంధీపై చాలా సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసారని.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరని బీజేపీ సీఎం ప్రశ్నించారని, గతంలో ప్రధాని మోదీ సైతం కశ్మీరీ..

Rahul Gandhi: రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించిన ప్రియాంక గాంధీ.. మోదీపై షాకింగ్ కామెంట్స్..
Priyanka Gandhi

Updated on: Mar 24, 2023 | 6:00 PM

రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై ప్రియాంక గాంధీ స్పందించారు. బీజేపీ చర్యలకు తాము భయపడేది లేదని ట్వీట్ చేశారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్ గాంధీపై చాలా సార్లు అనుచిత వ్యాఖ్యలు చేసారని.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరని బీజేపీ సీఎం ప్రశ్నించారని, గతంలో ప్రధాని మోదీ సైతం కశ్మీరీ పండితులను అవమానించేలా మాట్లాడారని ప్రియాంక ట్వీట్ చేశారు. నీరవ్ మోదీ , మోహుల్ చోక్సీల గురించి రాహుల్ మాట్లాడితే కోర్టులో జడ్జిలు శిక్ష వేశారని, స్పీకర్ అనర్హత వేటు వేశారని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా ఎలాంటి చర్యలు ఉండవని ప్రియాంక ట్వీట్ చేశారు.

ఇక రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై దేశ వ్యాప్తంగా ప్రముఖ పార్టీల నేతలు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన.. కేంద్రం తీరును తప్పుబట్టారు. ఇక బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని ఖండించారు.

ఇవి కూడా చదవండి

ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్స్ ఇవే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us