Maharashtra: పోలీస్‌ వ్యాన్‌లో హత్య కేసు నిందితుడి బర్త్‌ డే వేడుక.. కోర్టు ఆవరణలోనే కేక్‌ కట్‌చేసిన గ్యాంగ్‌స్టర్‌..! వైరలవుతున్న వీడియో

|

Aug 23, 2022 | 9:22 AM

పోలీసులు చూస్తుండగానే అనుమానితుడు తన స్నేహితులు ఇచ్చిన కేక్‌ను ఎస్కార్ట్ వ్యాన్ కిటికీలోంచి కట్ చేశాడు. రోషన్ ఝా కేక్ కట్ చేస్తున్న వీడియోను అతని అనుచరులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాలతో షూట్‌ చేశారు. తరువాత వారి వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశారు. భాయ్ కా బర్త్ డే హై

Maharashtra: పోలీస్‌ వ్యాన్‌లో హత్య కేసు నిందితుడి బర్త్‌ డే వేడుక.. కోర్టు ఆవరణలోనే కేక్‌ కట్‌చేసిన గ్యాంగ్‌స్టర్‌..! వైరలవుతున్న వీడియో
Prisoner Cutting Cake
Follow us on

Maharashtra Police: రౌడీషీటర్,గ్యాంగ్ స్టర్ గా పేరుపోయిన ఓ వ్యక్తిని  పలు హత్య కేసులో  నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ నిమిత్తం జైలు నుంచి  అతన్ని పట్టిష్ట బందోబస్తు నడుమ వ్యాన్‌లో కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇంతలో జైలు వద్ద ఆ గ్యాంగ్‌స్టర్‌ అనుచరులు ప్రత్యక్షమయ్యారు. పోలీస్‌ వ్యాన్‌లో ఉన్న అతనితో కేక్‌ కట్‌ చేయించి అతడి పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇదంతా వీడియోతీసి తమ వాట్సప్‌ స్టేటసుల్లో పెట్టుకున్నారు. అదికాస్తా వైరల్‌ అవడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాస్‌నగర్‌లో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు పోలీసులతో కలిసి బర్త్‌డే కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హత్య కేసుతో సహా పలు హత్యాయత్నం, క్రిమినల్ కేసుల్లో నిందితుడైన రోషన్ ఝాను విచారణ నిమిత్తం ట్రయల్ కోర్టుకు తీసుకువెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌కు చెందిన రోషన్‌ ఝా.. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌. రాజకీయంగా అత్యంత సన్నిహితుడు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఇతర కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. అతనిపై ఉల్లాస్‌నగర్, తిట్వాలా, కల్యాణ్, డోంబివిలిలో మూడు హత్యాయత్నం కేసులు సహా ఏడు తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తిట్వాలా పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసుకు సంబంధించి అధర్వడి జైలు నుంచి కళ్యాణ్‌లోని కోర్టుకు తీసుకువస్తుండగా, పోలీసు వ్యాన్‌లో కూర్చొని పుట్టినరోజు కేక్ కట్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

పోలీసులు చూస్తుండగానే అనుమానితుడు తన స్నేహితులు ఇచ్చిన కేక్‌ను ఎస్కార్ట్ వ్యాన్ కిటికీలోంచి కట్ చేశాడు. రోషన్ ఝా కేక్ కట్ చేస్తున్న వీడియోను అతని అనుచరులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాలతో షూట్‌ చేశారు. తరువాత వారి వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశారు. భాయ్ కా బర్త్ డే హై అనే పాట కూడా పాడారు. ఝా పక్కన, ఇతర అండర్ ట్రయల్‌లు కూడా కనిపిస్తారు. వాహనం లోపల పోలీసులు కూడా కనిపిస్తారు. కోర్టు అనుమతి లేకుండా కస్టడీలో ఉన్న ఎవరినీ బయట ఆహారాన్ని అనుమతించరు.

ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ‘అతన్ని కోర్టుకు తరలించిన పోలీసు ఎస్కార్ట్ బృందం థానే రూరల్ పోలీసులకు చెందినది. అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ (థానే రూరల్) విక్రమ్ దేశ్‌మన్ ధృవీకరించారు. ఇలాంటి కేసుల్లో అండర్ ట్రయల్స్‌కే ప్రాధాన్యతనిస్తే, శాఖాపరమైన విచారణ అనంతరం వారిని బదిలీ చేయడం లేదా సస్పెండ్ చేయడం వంటివి చేయవచ్చని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. నిందితులకు వెసులుబాటు కల్పించిన పోలీసుల చర్యపై పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి