లతా దీనానాథ్ మంగేష్కర్(Lata Mangeshkar Award) తొలి అవార్డును అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi). లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఏర్పాటు చేశారు. ముంబైలోని షణ్ముకానంద హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు ప్రధాని మోడీ. అంతకుముందు లతా మంగేష్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ అవార్డును దేశప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా, సంగీతం, ధ్యానం మరియు భావోద్వేగం కూడా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ వేడుకలో లతా మంగేష్కర్‌ను గుర్తు చేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. తరతరాలకు ప్రేమ, భావోద్వేగాలను బహుమతిగా అందించిన లతా దీదీ నుంచి సోధరి ప్రేమను పొందానని ప్రధాని అన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? చాలా దశాబ్దాల తర్వాత, ఈ మొదటి రాఖీ పండుగ వస్తుంది. ఇప్పుడు సోదరి లేదు. సుధీర్ ఫడ్కే నా లతా దీదీని మొదటిసారి కలిసేలా చేశారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.
లతా దీదీ సింప్లిసిటీకి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. లతా దీదీ సంగీతంలో ఆ స్థానాన్ని సాధించారు. ప్రజలు ఆమెను మా సరస్వతికి చిహ్నంగా భావిస్తారు. దాదాపు 80 ఏళ్ల పాటు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. సంగీతం మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది.
#WATCH | For me, Lata didi was like an elder sister. I have always received immense love from her. After many decades, Lata didi will not be present in the coming Rakhi festival: Prime Minister Narendra Modi on the first Lata Deenanath Mangeshkar Award pic.twitter.com/zwMQJJje1T
— ANI (@ANI) April 24, 2022
దేశానికి, ప్రజలకు, సమాజానికి మార్గనిర్దేశం చేస్తూ.. విశేష కృషి చేసే వ్యక్తికి ఈ అవార్డును ప్రతిఏటా అందజేస్తామని మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ఉషా మంగేష్కర్, ఆశా భోస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ సహా ప్రముఖులు హాజరయ్యారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరి 6న కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి: Viral Video: వెరైటీగా ట్రై చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. వీర ప్రేమికుడికి షాక్ ఇచ్చిన పోలీసులు..
Kurnool: కర్నూలు జిల్లాలో కిలాడి దంపతులు.. చోర విద్యలో ప్రావీణ్యులు.. ఏమార్చి..