Modi Gujarat Tour: సొంత రాష్ట్రానికి ప్రధాని నరంద్ర మోదీ కానుకల వర్షం.. గ్లోబల్ మెడిసిన్ సెంటర్‌, డెయిరీ కాంప్లెక్స్‌‌కు శ్రీకారం

|

Apr 19, 2022 | 12:26 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 18 నుంచి మూడు రోజుల పాటు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు .

Modi Gujarat Tour: సొంత రాష్ట్రానికి ప్రధాని నరంద్ర మోదీ కానుకల వర్షం.. గ్లోబల్ మెడిసిన్ సెంటర్‌, డెయిరీ కాంప్లెక్స్‌‌కు శ్రీకారం
Pm Modi
Follow us on

PM Narendra Modi Gujarat Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 18 నుంచి మూడు రోజుల పాటు తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బనస్కాంతలోని దేవదార్‌లోని బనాస్ డెయిరీ కాంప్లెక్స్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది కాకుండా, జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సెంటర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అతని మారిషస్ కౌంటర్ ప్రవింద్ కుమార్ జుగ్నాత్, WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ కూడా పాల్గొన్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటన రెండో రోజైన మంగళవారం ప్రధాని మోదీ గుజరాత్‌లోని బనస్కాంతలోని దేవదర్‌లో డెయిరీ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రానికి దాదాపు 22 వేల కోట్ల ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు.

బనస్కాంతలో కొత్త డెయిరీ కాంప్లెక్స్‌తో పాటు బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్‌ను రూ.600 కోట్లతో నిర్మించారు. కొత్త డెయిరీ కాంప్లెక్స్‌లో రోజుకు 30 లక్షల లీటర్ల పాలు, సుమారు 80 టన్నుల వెన్న, లక్ష లీటర్ల ఐస్‌క్రీం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. 20 టన్నుల కోవా, ఆరు టన్నుల చాక్లెట్లు ఉత్పత్తి చేయనున్నారు. అలాగే, బంగాళదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ఆలూ టిక్కీలు, ప్యాటీస్‌తో సహా వివిధ రకాల ప్రాసెస్ చేసిన బంగాళాదుంప ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుందని PMO తెలిపింది. వీటిలో చాలా ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ ప్లాంట్లు స్థానిక రైతులను శక్తివంతం చేస్తాయి. ఈ ప్రాంతంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచుతాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను కూడా మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

అలాగే, ఏప్రిల్ 20న గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం దాహోద్‌లో జరిగే ఆదిజాతి మహాసమ్మేళనంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్స్ ఏటా 500 కోట్ల డేటా సెట్‌లను సేకరిస్తుంది. బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి వాటిని అర్థవంతంగా విశ్లేషిస్తుందని PMO తెలిపింది. దీని లక్ష్యం విద్యార్థులకు మొత్తం అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం. ఈ కేంద్రం ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారీ ఆన్‌లైన్ హాజరును పర్యవేక్షిస్తుంది. విద్యార్థుల అభ్యాస ఫలితాలపై కాలానుగుణంగా కేంద్రీకృత మూల్యాంకనాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచ బ్యాంకు దీనిని ప్రపంచ అత్యుత్తమ అభ్యాసంగా అభివర్ణించిందని PMO పేర్కొంది.

Read Also…  Nagabhushanam: అసాధారణమైన నటనా కౌశల్యం.. విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన విలక్షణ నటుడు నాగభూషణం