సుష్మా మృతికి.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల సంతాపం!

తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్‌కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. భారత ప్రజలకు ఆమె అందించిన సేవలు మరువలేనివన్నారు. సుష్మా […]

సుష్మా మృతికి.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల సంతాపం!

Edited By:

Updated on: Aug 07, 2019 | 10:06 AM

తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్‌కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం తెలిపారు.

సుష్మాస్వరాజ్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. భారత ప్రజలకు ఆమె అందించిన సేవలు మరువలేనివన్నారు.

సుష్మా మృతి తనను ఎంతగానో కలిచివేసిందని వెంకయ్య నాయడు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సుష్మాస్వరాజ్ మరణం దేశానికి తీరని లోటని.. అద్భుతమైన నాయకురాలిని కోల్పోయామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.