బాయ్‌ ఫ్రెండ్‌ గొంతు కోసి చంపిన 16 ఏళ్ల ప్రెగ్నెంట్‌ బాలిక..! ఎక్కడంటే..

గర్భం దాల్చిన పదహారేళ్ల యువతి తన బాయ్‌ ఫ్రెండ్‌ గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. ఈ షాకింగ్‌ ఘగన చత్తీస్‌ఘ‌డ్‌లో జ‌రిగింది. రాయ్‌పూర్‌లోని ఏవ‌న్ లాడ్జీలో ఆదివారం (సెప్టెంబర్‌ 29) జ‌రిగిన ఈ సంఘటన. స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

బాయ్‌ ఫ్రెండ్‌ గొంతు కోసి చంపిన 16 ఏళ్ల ప్రెగ్నెంట్‌ బాలిక..! ఎక్కడంటే..
Teenager Killed Boy Friend Chhattisgarh

Updated on: Sep 30, 2025 | 5:28 PM

చత్తీస్‌ఘ‌డ్‌, సెప్టెంబర్‌ 30: చత్తీస్‌ఘ‌డ్‌లోని బిలాస్‌పూర్‌లోని కోని పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న చెందిన 16 ఏళ్ల నిందితురాలు సెప్టెంబ‌ర్‌ 28వ తేదీన త‌న బాయ్‌ఫ్రెండ్ మొహ‌మ్మ‌ద్ స‌ద్దాంను క‌లిసేందుకు రాయ్‌పూర్ వెళ్లింది. మొహ‌మ్మ‌ద్ స‌ద్దాం.. బీహార్‌కు చెందిన ఎంఎస్ ఇంజినీరింగ్ ఆఫీస‌ర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి శనివారం (సెప్టెంబర్‌ 28) రాయ్‌పూర్‌లోని రామన్ మందిర్ వార్డ్‌లోని సత్కర్ గాలిలో ఉన్న అవాన్ లాడ్జ్‌కి వెళ్లారు. అయితే ఆమె అప్పటికే ప్రెగ్నెంట్ కావడంతో.. అబార్షన్‌ చేయించుకోవాలని బాయ్‌ఫ్రెండ్‌ సద్దాం ఒత్తిడి తెచ్చాడు. అబార్ష‌న్ విషయమై లాడ్జీ బ‌య‌ట ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ కూడా జ‌రిగింది. మైనర్‌ అబార్షన్‌కు అంగీకరించకపోవడంతో క‌త్తితో చంపేస్తాన‌ని బెదిరించాడు.

అదే రోజు రాత్రి (సెప్టెంబర్ 28 రాత్రి) లాడ్జీ రూమ్‌లో స‌ద్దాం నిద్రిస్తున్న స‌మ‌యంలో.. అత‌డు చంపుతానని బెదిరించిన క‌త్తితోనే మైనర్‌ యువతి అత‌డి గొంతు కోసేసింది. ఆ త‌ర్వాత రూమ్‌ను బ‌య‌టి నుంచి లాక్ చేసి.. స‌ద్దాం మొబైల్ ఫోన్‌తో అక్కడి నుంచి పరారైంది. ఆ తర్వాత లాడ్జీ రూమ్ తాళం చెవుల‌ను స‌మీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వ‌ద్ద ప‌డేసింది. మ‌రుస‌టి రోజు నిందితురాలు బిలాస్‌పూర్‌లోని తమ సొంత ఇంటికి వెళ్లి జ‌రిగిన నేరం గురించి త‌న త‌ల్లికి చెప్పింది.

దీంతో షాక్‌కు గురైన నిందితురాలి తల్లి నేరుగా కోని పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి మ‌ర్డ‌ర్ గురించి ఫిర్యాదు చేసింది. ఆమె సమాచారం మేరకు పోలీసులు ఏవ‌న్ లాడ్జీకి వెళ్లిన మృతి చెందిన స‌ద్దాం మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయ్‌పూర్ పోలీసులు.. బీహార్‌లో ఉన్న స‌ద్దాం ఫ్యామిలీని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నామని, దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్పారు. మైన‌ర్‌ను అదుపులోకి తీసుకున్నమని, ఆమె మూడు నెల‌ల గ‌ర్భిణి అని వెల్లడించారు. అబార్ష‌న్ చేయించుకోవడం తనకు ఇష్టం లేద‌ని ఆ అమ్మాయి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.