గజరాజుల ప్రాణాలను తీస్తున్న కరెంట్ తీగలు.. ఆరు నెలల్లో ఆరు ఏనుగులు మృత్యువాత

అసోం రాష్ట్రంలో మరో ఏనుగు మృత్యువాతపడింది. గత కొద్ది నెలలుగా వరుసగా ఏనుగులు విద్యుదాఘాతానికి గురవడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు ఏనుగుల మృతికి కారణమవుతున్నాయి.

గజరాజుల ప్రాణాలను తీస్తున్న కరెంట్ తీగలు.. ఆరు నెలల్లో ఆరు ఏనుగులు మృత్యువాత

Updated on: Dec 18, 2020 | 1:23 PM

అసోం రాష్ట్రంలో మరో ఏనుగు మృత్యువాతపడింది. గత కొద్ది నెలలుగా వరుసగా ఏనుగులు విద్యుదాఘాతానికి గురవడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు ఏనుగుల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా అసోం రాష్ట్రంలోని చిరాంగ్ జిల్లా సికాజోరా గ్రామంలో గర్భం దాల్చిన 20 ఏళ్ల వయసున్న ఏనుగు కరెంట్ షాక్ తో మరణించిందని స్థానిక అటవీ అధికారులు తెలిపారు.

కాగా, అసోం రాష్ట్రంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఆరు నెలల్లో ఆరు ఏనుగులు విద్యుదాఘాతంతో మరణించాయని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ బ్రహ్మానంద పాతిరి చెప్పారు. పొలాల్లో విద్యుత్ కంచెలను ఏర్పాటు చేయడం వల్ల ఏనుగులు మృత్యువాతపడుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు కరెంట్ వైర్లతో రక్షణ ఏర్పాటు చేసుకున్నామని ఏనుగుల చంపాల్సిన ఉద్దేశ్యం కాదంటున్నారు రైతులు.

ఇదిలావుంటే, 2009 నుంచి 2020 సెప్టెంబరు వరకు అసోంలో విద్యుదాఘాతం కారణంగా 113 ఏనుగులు మరణించాయని అసోం అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఒక్క చిరాంగ్ జిల్లాలోనే ఐదు ఏనుగులు మరణించాయి. ఏనుగులను చంపడానికి విద్యుత్ ను వినియోగిస్తున్నందు వల్ల ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని అధికారులు చెపుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us