Mahant Narendra Giri: ఎన్నో అనుమనాలు..మరెన్నో ప్రశ్నలు.. మిస్టరీగా మారిన మహంత్ నరేంద్రగిరి సూసైడ్‌..

|

Sep 21, 2021 | 9:01 PM

ఒక సూసైడ్. 8 పేజీల లేఖ. సిట్ ఏర్పాటు. ఇద్దరి అరెస్ట్. అయినా ఎన్నో అనుమానాలు.! మరెన్నో అంతుచిక్కని ప్రశ్నలు.! ఇష్యూ పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఇంతకీ మఠంలో ఏం జరిగింది? మహంత్‌ నరేంద్రగిరి మరణం వెనుక దాగున్న నిజాలేంటి.?!

Mahant Narendra Giri: ఎన్నో అనుమనాలు..మరెన్నో ప్రశ్నలు.. మిస్టరీగా మారిన మహంత్ నరేంద్రగిరి సూసైడ్‌..
Mahant Narendra Giri
Follow us on

ఒక మరణం..వంద ప్రశ్నలు. అఖిల భారత అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర సూసైడ్ దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. దర్యాప్తు కోసం 18 మందితో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో రెండో అరెస్ట్ జరిగింది. ఆద్యాతివారీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇతడు హనుమాన్‌ టెంపుల్‌లో ప్రధాన పూజారిగా ఉన్నారు. గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా ఇప్పటికే స్వామీజీ శిష్యుడు ఆనందగిరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరినీ సిట్‌కు అప్పగించారు. అటు గన్‌మెన్‌కు కూడా నోటీసులు జారీ చేశారు..అసలు నరేంద్రగిరి సూసైడ్‌ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కోణంలో ఇన్వెస్టిగేషన్‌ ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు పోలీసులు. ఈ కేసుని CBIకి అప్పగించాలని సాధువులు డిమాండ్ చేస్తున్నారు.. ప్రాథమికంగా నరేంద్రగిరిది ఆత్మహత్యే అని చెబుతున్నా.. అతడి శిష్యులు మాత్రం ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు.

అయితే సూసైడ్‌నోట్‌లో ఆనందగిరితోపాటు మరో ఇద్దరిపై ఆరోపణలు చేశారు నరేంద్రగిరి స్వామీజీ. అయితే ఇది సూసైడ్ కాదు.. చంపేశారంటున్నారు ఆనందగిరి. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అటు సూసైడ్‌ చేసుకునే ముందు ఎవరైనా అంత సుదీర్ఘలేఖ రాస్తారా అంటూ కొత్త పాయింట్లు లెవనెత్తారు ఆనందగిరి లాయర్. ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.. బీజేపీని ప్రశ్నించిన సాధువులకు ఇలాగే జరుగుతోందని విమర్శించింది. యూపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసింది.. అటు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని అఖిలేష్ యాదవ్ కోరారు..

ప్రస్తుతానికి అయితే ఈ సూసైడ్ కేసు మొత్తం ఆనందగిరి చుట్టూనే తిరుగుతోంది. అతడికి క్రిమినల్ హిస్టరీ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మఠం భూములపై ఆనంగిరి ఎప్పటి నుంచో కన్నేశాడని పలువురు స్వామీజీలు ఆరోపిస్తున్నారు. మరి సిట్‌ అదుపులో ఉన్న అతడు నోరు విప్పుతాడా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక మొత్తం కేసులో ఫోరెన్సిక్‌ రిపోర్టు చాలా కీలకం కానుంది. ఆ సమయంలో మఠంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక చంపేశారా? అన్న డౌట్లపై ఫోరెన్సిక్‌ రిపోర్టు తర్వాతే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి: KTR-Revanth: డ్రగ్స్‌పై మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటి సివిల్‌ కోర్టు..