Minister Pralhad Joshi: యువకుల జీవితాలతో ఆడుకున్నారు.. ఈడీ దాడులపై స్పందంచిన కేంద్ర మంత్రి..

Rajasthan Assembly Election 2023: రాజస్థాన్‌లో ఈడీ సోదాలపై కేంద్ర మంత్రి, రాజస్థాన్ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రహ్లాద్ జోషి స్పందించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార ఇంట్లో ఈడీ సోదాల పై ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో 19 సార్లు రికార్డు పేపర్ లీక్ కారణంగా 70 లక్షల మందికి పైగా యువత భవిష్యత్తు చెడిపోయిందని అన్నారు. ఈ కేసులో మాజీ కాంగ్రెస్ రాష్ట్ర మంత్రితో సహా RPSC సభ్యులు కూడా పట్టుబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ చర్యలు తీసుకుంటున్నా..

Minister Pralhad Joshi: యువకుల జీవితాలతో ఆడుకున్నారు.. ఈడీ దాడులపై స్పందంచిన కేంద్ర మంత్రి..
Minister Pralhad Joshi

Updated on: Oct 26, 2023 | 8:25 PM

మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో ఈడీ సోదాలపై కేంద్ర మంత్రి, రాజస్థాన్ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రహ్లాద్ జోషి స్పందించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార ఇంట్లో ఈడీ సోదాల పై ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో 19 సార్లు రికార్డు పేపర్ లీక్ కారణంగా 70 లక్షల మందికి పైగా యువత భవిష్యత్తు చెడిపోయిందని అన్నారు. ఈ కేసులో మాజీ కాంగ్రెస్ రాష్ట్ర మంత్రితో సహా RPSC సభ్యులు కూడా పట్టుబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ చర్యలు తీసుకుంటున్నా కాంగ్రెస్ నేతలు తప్పేమీ లేదంటే ఎందుకు భయపడుతున్నారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.

రాజస్థాన్‌లో ప్రభుత్వం ఏసీబీని నిర్వీర్యం చేసి అవినీతి నేతలకు రక్షణ కల్పించకుండా ఉంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కోట్లాది రూపాయలు వస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు చురుగ్గా కనిపిస్తున్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఈడీ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. మరోవైపు రాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లుగా సమాచారం. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించనున్నారు. ఈ నెల 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి