Jaya Prada: జయప్రదకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ.. ఆ రెండు కేసుల్లో రాంపూర్ స్పెషల్ కోర్టు ఆగ్రహం

ప్రముఖ నటి, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రదపై రాంపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Jaya Prada: జయప్రదకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ.. ఆ రెండు కేసుల్లో రాంపూర్ స్పెషల్ కోర్టు ఆగ్రహం
Former MP Jaya Prada

Edited By: Sanjay Kasula

Updated on: Dec 22, 2022 | 3:02 PM

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు యూపీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించినందుకు గాను రాంపూర్‌ కోర్టు జయప్రదకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కోడ్‌ అతిక్రమించిందంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఇప్పుడు వారెంట్‌ జారీ అయ్యింది. మరోవైపు ఇదే కేసులో జయప్రద వరుసగా విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసి, జనవరి9న కోర్టులో హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసులో విచారణకు జయప్రద గైర్హాజరు కావడం వల్ల మంగళవారం ఎన్‌బిడబ్ల్యును జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది అమర్‌నాథ్ తివారీ తెలిపారు.

2019 సార్వత్రిక ఎన్నికలకి ముందు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపేలో చేరారు జయప్రద.. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అజాం ఖాన్‌ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ పార్లమెంటేరియన్ జయప్రదపై రాంపూర్‌లోని ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు కోర్టు శిక్ష పడింది

కేసుల విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్‌ జారీ చేసింది. మాజీ ఎంపీని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. గతంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలీ యూసుఫ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంజయ్ కపూర్‌లకు కూడా ఇదే కోర్టు శిక్ష విధించడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం