రూ.2 కోట్లు నొక్కేయాలనుకున్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..

|

Nov 23, 2020 | 3:24 PM

అత్యాశకు పోయి ఓ పోలీసు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు.. ఓ బిల్డర్ నుంచి డబ్బులు లాగేందుకు యత్నించి ఉన్నతాధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..

రూ.2 కోట్లు నొక్కేయాలనుకున్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు..
Follow us on

అత్యాశకు పోయి ఓ పోలీసు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు.. ఓ బిల్డర్ నుంచి డబ్బులు లాగేందుకు యత్నించి ఉన్నతాధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్ బీర్ సింగ్ ఓ బిల్డర్‌ను బెదిరించి రూ. 2 కోట్లు కొట్టెయాలనుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం వేశాడు. ఆ బిల్డర్ నెంబర్ గ్యాంగ్‌స్టర్‌ కాలాకు పంపించి బెదిరించాలని కోరాడు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అతడి కొడుకుపై దాడి చేయాలని సూచించాడు.

బిల్డర్ ఈ కాల్ రికార్డ్‌ను ఉన్నత అధికారులకు పంపించాడు. అయితే కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులకు ఇన్స్‌పెక్టర్ బండారం బయటపడిపోయింది. దీంతో రాజ్‌బీర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా గ్యాంగ్‌స్టర్ కాలాకు, రాజ్ బీర్‌సింగ్‌కు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే 2005లో రాజ్‌బీర్ సింగ్ రాష్ట్రపతి పురస్కారంతో పాటు ఏడుసార్లు అసాధారణ్ కార్య పురస్కార్ అవార్డులు పొందారు. 2015లో ప్రమోషన్ కూడా పొందారు వీటన్నింటిని పోలీస్ శాఖ వెనక్కితీసుకుంటుందని ప్రకటించింది. అయితే తనపై ఆరోపణలు నిరాధారమైనవని రాజ్‌బీర్ సింగ్ ఖండిస్తున్నాడు.