ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం జరిగిందంటే..?

తమిళనాడులోని కోయంబత్తూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ నీచానికి పాల్పడ్డాడు. తనకు నమ్మకంగా ఉంటాడనుకున్న ఇన్‌స్పెక్టర్ అతడు చేసిన పనికి షాక్ అయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పింపించాడు. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అసలేం జరిగింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం జరిగిందంటే..?
Inspector Driver Arrest

Updated on: Dec 24, 2025 | 5:23 PM

రక్షక భటులే భక్షకులుగా మారితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ..? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్.. తన పైఅధికారి ఇంట్లోనే నీచానికి ఒడిగట్టాడు. నమ్మకంగా ఉంటాడని పంపిన ఇన్‌స్పెక్టర్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక యువతిపై దారుణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పొల్లాచి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ డ్రైవర్‌గా మాధవ కన్నన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇన్‌స్పెక్టర్‌కు అత్యంత సన్నిహితుడిగా, కుటుంబ సభ్యుడిలా మెలిగేవాడు. ఇన్‌స్పెక్టర్ తన కూతుళ్ల సంరక్షణ కోసం బంధువైన యువతిని పనికి కుదుర్చుకున్నారు. గత రెండు రోజులుగా పని ఒత్తిడి కారణంగా ఇన్‌స్పెక్టర్ ఇంటికి వెళ్లలేకపోయారు. తన కుటుంబానికి, పిల్లలకు రక్షణగా ఉంటాడని భావించి తన డ్రైవర్ మాధవ కన్నన్‌ను ఇంటికి పంపించారు. కానీ ఆ నమ్మకమే ఇన్‌స్పెక్టర్ కుటుంబానికి శాపమైంది.

కెమెరాకు చిక్కిన నీచం

పిల్లలను చూసుకునే యువతి స్నానం చేయడానికి వెళ్ళింది. అది గమనించిన మాధవ కన్నన్ తనలోని వికృత చేష్టలను బయటపెట్టాడు. కిటికీ ద్వారా ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించడం ప్రారంభించాడు. సమయం చూసి గమనించిన ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. భయంతో వణికిపోతూ వెంటనే ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన చోట ఇలాంటి అఘాయిత్యం జరగడంతో ఇన్‌స్పెక్టర్ సైతం విస్తుపోయారు.

పోలీసుల వేగవంతమైన చర్యలు

ఈ ఘటనపై వెంటనే మదుక్కరాయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడు పోలీస్ శాఖకు చెందిన వాడే అయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులోని వీడియో ఆధారాలను సేకరించారు. నేరం రుజువు కావడంతో కానిస్టేబుల్ మాధవ కన్నన్‌ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళల భద్రత కోసం నిరంతరం శ్రమించాల్సిన పోలీసులే ఇలాంటి హీనమైన పనులకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.