PM Modi: పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ

భారత్, చైనా వివాదంలో శాంతి కోసమే తాము కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపు చర్చల ద్వారానే సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు. గోద్రా అల్లర్ల అంశంలో తాము నిర్దోషులమని కోర్టు తేల్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ద్వారానే తన జీవితానికి ఒక అర్థం దొరికందన్నారు.

PM Modi: పాక్ ఎప్పుడూ భారత్‌తో శత్రుత్వమే కోరుకుంటోంది: ప్రధాని మోదీ
Pm Modi Podcast

Updated on: Mar 17, 2025 | 8:00 AM

భారత్, చైనా వివాదంలో శాంతి కోసమే తాము కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపు చర్చల ద్వారానే సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు. గోద్రా అల్లర్ల అంశంలో తాము నిర్దోషులమని కోర్టు తేల్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ద్వారానే తన జీవితానికి ఒక అర్థం దొరికందన్నారు. ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మెన్‌తో సాగిన పాడ్‌కాస్ట్‌లో అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు మోదీ.

ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. వారితో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. లెక్స్ ఫ్రిడ్‌ మ్యాన్‌తో జరిగిన పాడ్ కాస్ట్‌లో అనేక అంశాలపై స్పందించారు. 2020లో సరిహద్దులో ఉద్రిక్తతలు ఏర్పడిన తర్వాత, ఇప్పుడు రెండు దేశాలూ పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా తన జీవితానికి ఒక లక్ష్యం దొరికిందన్నారు ప్రధాని మోదీ RSS సేవా భావం, రామకృష్ణ మిషన్, స్వామి వివేకానంద బోధనలు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు.

గోద్రా అల్లర్ల విచారణ సమయంలో తమ రాజకీయ ప్రత్యర్థులు కేంద్రంలో అధికారంలో ఉన్నారన్నారు ప్రధాని మోదీ. ఈ అంశంలో తమపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారన్నారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా, న్యాయవ్యవస్థ రెండుసార్లు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి, తమను నిర్దోషులుగా తేల్చిందని గుర్తు చేశారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు చర్చల ద్వారానే సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు రెండు దేశాలు చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మొదటి టర్మ్‌తో పోలిస్తే, రెండో టర్మ్‌లో మరింత సన్నద్ధంగా కనిపిస్తున్నారని మోదీ తెలిపారు. ఈసారి ట్రంప్ మునుపటికంటే బాగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తోందన్నారు. ఆయన మనసులో స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉందని అభిప్రాయపడ్డారు.