PM Modi: సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

|

Jan 03, 2023 | 7:56 AM

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ.. భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 108వ సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు.

PM Modi: సమగ్ర అభివృద్ధే లక్ష్యం.. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
Pm Modi
Follow us on

Indian Science Congress: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ.. భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 108వ సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. మహారాష్ట్రలోని రాష్ట్రసంత్‌ తుకాదోజీ మహారాజ్‌ నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 108వ సదస్సు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గత సమావేశం 2020 జనవరిలో బెంగళూరులో జరిగింది. అనంతరం కరోనావైరస్‌ కారణంగా రెండేళ్లుగా సైన్స్‌ కాంగ్రెస్‌ను నిర్వహించలేదు. ఈసారి నిర్వహించే సైన్స్‌ కాంగ్రెస్‌ లో సమగ్ర అభివృద్ధే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించడంతోపాటు సైన్స్‌ కాంగ్రెస్‌ థీమ్‌ను విడుదల చేసింది. మహిళా సాధికారతతో కూడిన శాసత్రసాంకేతిక సుస్థిర అభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకున్నట్లు పీఎంవో తెలిపింది. సైన్స్ కాంగ్రెస్‌లో అభివృద్ధి, మహిళా సాధికారత, దానిని సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర గురించి చర్చ జరగనుంది. సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే సభ్యులు విద్య, పరిశోధనలు, పరిశ్రమలలో సైన్స్‌, మహిళల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నారు. దీంతోపాటు సాంకేతిక రంగంలో పలు ఆవిష్కరణలు, పేపర్‌ ప్రజెంటేషన్లు తదితర విషయాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

దేశవ్యాప్తంగా అగ్ర పరిశోధకులందరూ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కు హాజరుకానున్నారు. కాగా, ఈ సదస్సు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ప్రధాని ప్రత్యక్షంగా ప్రారంభ కార్యక్రమంలో లేకుండా జరుగుతుందని పేర్కొంటున్నారు. చివరిగా 2004లో అప్పటి ప్రధాని వాజపేయి వాతావరణ సమస్యల కారణంగా సదస్సుకు హాజరుకాలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..