PM Narendra Modi: అపార్ట్‌మెంట్లలో కమిటీలుగా ఏర్పడితే కంటైన్‌మెంట్‌ జోన్లే అవసరం ఉండదు: ప్రధాని మోదీ

|

Apr 20, 2021 | 10:02 PM

PM Narendra Modi: దేశంలో కరోనా వైరస్‌ శరవేగంగా పెరిగిపోతోంది. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వ్యాక్సినేష...

PM Narendra Modi: అపార్ట్‌మెంట్లలో కమిటీలుగా ఏర్పడితే కంటైన్‌మెంట్‌ జోన్లే అవసరం ఉండదు: ప్రధాని మోదీ
Pm Modi
Follow us on

PM Narendra Modi: దేశంలో కరోనా వైరస్‌ శరవేగంగా పెరిగిపోతోంది. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే.. మరో వైపు కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారీగా కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లోన తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ పరిస్థితులు తీసుకురావొద్దని, దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడాలని మోదీ అన్నారు. రామనవమి, రంజాన్‌ పండగలు ఉన్నందున ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. లాక్‌డౌన్‌ చివరి అస్త్రంగానే పరిగణించాలని మోదీ పిలుపునిచ్చారు.

దేశ ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. దేశంలో ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరిగిందని, డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి, కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. ఈ మేరకు ఫార్మా కంపెనీలు సంప్రదించామని, భారీగా కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారత్‌లో తయారైన రెండు టీకాల ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. మే 1వ తేదీ నుంచి18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందిస్తామని పేర్కొన్నారు. కొత్త వ్యాక్సిన్‌ కోసం ఫ్రాస్ట్‌ ట్రాక్‌ పద్దతిని అవలంబిస్తున్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మీమీ ప్రాంతాల్లో, అపార్ట్‌మెంట్లలో కమిటీలుగా ఏర్పడి జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడు కంటైన్‌మెంట్‌ జోన్‌లు అవసరం ఉండదని ప్రధాని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని పేర్కొన్నారు.

 

Also Read:

PM Modi: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం