PM Modi: శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. అండగా ఉంటామని హామీ.. తుఫాన్ బాధితుల కోసం..

శ్రీలంకలో దిత్వా తుఫాను బీభత్సం సృష్టించింది. 300 మందికి పైగా మరణించగా, లక్షన్నర మంది శిబిరాల్లో ఉన్నారు. ఈ విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు దిసానాయకేతో ఫోన్‌లో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు నిరంతరం సహాయం అందిస్తామని తెలిపారు.

PM Modi: శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. అండగా ఉంటామని హామీ.. తుఫాన్ బాధితుల కోసం..
Pm Modi President Dissanayake

Updated on: Dec 01, 2025 | 9:38 PM

దిత్వా తుఫాన్ శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ ధాటికి దాదాపు 300మందికి పైగా మరణించగా.. వందలాది మంది గల్లంతయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రభావితమవడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సుమారు లక్షన్నర మందిని తాత్కాలిక పునరావాస శిబిరాలకు తరలించారు. శ్రీలంకలో తుఫాను సృష్టించిన ప్రాణనష్టం, విస్తృత విధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తుఫాను అనంతర పరిస్థితి, సహాయక చర్యలపై శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్ని విధాల అండగా మోదీ హామీ ఇచ్చారు.

తుఫాను వల్ల జరిగిన ప్రాణనష్టం, నష్టంపై ప్రధాని మోదీ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. . ఈ కష్ట సమయంలో భారత్ ఎప్పుడూ శ్రీలంకకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలను, సామగ్రిని పంపినందుకు అధ్యక్షుడు దిసానాయకే భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత సహాయం చాలా వేగంగా, ప్రభావవంతంగా ఉందని శ్రీలంక ప్రజలు ప్రశంసించారని ఆయన తెలిపారు.

సాగర్ బంధు కింద నిరంతరం అండగా..

ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు రక్షణ, సహాయం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. శ్రీలంకలో పునరావాస పనులు, ప్రజా సేవలు తిరిగి ప్రారంభం కావడానికి, జీవనోపాధిని పునరుద్ధరించడానికి అవసరమైన సహాయాన్ని భారత్ భవిష్యత్తులో కూడా అందిస్తూనే ఉంటుందని తెలిపారు. ఇద్దరు నాయకులు భవిష్యత్తులోనూ సన్నిహితంగా ఉంటూ సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.