
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. భారత్ పారిశ్రామిక అభివృద్ధి పథకం (భవ్య)కు ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్లగ్-అండ్-ప్లే పద్ధతిలో ఉంటాయి. అంటే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. అలాగే, 100 పెద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయనున్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ పథకం కోసం రూ. 33,660 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే ఈ పథకం లక్ష్యమన్నారు. భారతదేశంలో తయారైన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడమే లక్ష్యంగా ఉన్న ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇది ఒక విస్తృత రూపమని కేంద్ర మంత్రి తెలిపారు.
#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw says, "Union Cabinet has approved BHAVYA – Bharat Audyogik Vikas Yojana, a central sector scheme for developing 100 investment-ready plug and play industrial parks with an outlay of Rs 33,660 crores." pic.twitter.com/OGp09nrS1D
— ANI (@ANI) March 18, 2026
ఇక ఇవాళ్టి కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యంగా పత్తికి కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాలపై ఖర్చు చేసిన రూ. 1,718 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు ఆమోదం లభించింది. 2023-24 పత్తి సీజన్‌లో పత్తికి కనీస మద్దతు ధర (MSP) కార్యకలాపాలపై ఖర్చు చేసిన రూ. 1,718 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ డెవలపర్‌ల సహకారంతో ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్నారు. ఛాలెంజ్ మోడ్ ద్వారా ప్రాజెక్టులు ఎంపిక చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే, ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి నుండి బహ్రాయిచ్ (101.515 కి.మీ.) వరకు 4-లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ జాతీయ రహదారి-927 నిర్మాణానికి రూ. 6969.04 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw says," Cabinet has approved MSP funding of Rs. 1,718.56 crore to CCI for cotton seasons 2023-24 for direct support to cotton farmers." pic.twitter.com/RQbAPRVdAH
— ANI (@ANI) March 18, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..