PM Modi Brother Accident: రోడ్డు ప్రమాదానికి గురైన ప్రధాని మోదీ సోదరుడు.. కుటుంబంతో కలిసి బంధీపూర్ వెళ్తుండగా ఘటన..

|

Dec 27, 2022 | 5:28 PM

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. కర్ణాటకలోని మైసూర్‌లో  ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో కారులో ప్రహ్లాద్‌తో  పాటు ఆయన..

PM Modi Brother Accident: రోడ్డు ప్రమాదానికి గురైన ప్రధాని మోదీ సోదరుడు.. కుటుంబంతో కలిసి బంధీపూర్ వెళ్తుండగా ఘటన..
Pm Modi Brother Prahlad Modi Car Accident
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. కర్ణాటకలోని మైసూర్‌లో  ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో కారులో ప్రహ్లాద్‌తో  పాటు ఆయన కొడుకు, కోడలు, మనవడు కూడా ఉన్నారు.ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబం వారి మెర్సిడెస్ బెంజ్ కారులో బెంగళూరు నుంచి బందీపూర్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. ఫలితంగా ప్రహ్లాద్ మోదీకి, ఆయన కోడలు, మనవడికి తీవ్ర గాయలయ్యాయి. ఆయన కుమారుడు, కార్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న మైసూర్ ఎస్పీ  సీమా లట్కర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే మైసూరులోని జేఎస్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. మైసూరు తాలూకాలోని కడకోలా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కాగా, ప్రహ్లాద్ మోడీ గుజరాత్ ఫెయిర్‌ప్రైస్ షాప్స్, కిరోసిన్ లైసెన్స్ హోల్డర్ అసోసియేషన్ అధినేత. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రహ్లాద్ మోదీ..‘‘గుజరాత్‌కు ఎందరో ప్రజలు స్వేచ్ఛగా వస్తుంటారు, పోతుంటారు. గుజరాత్ ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. అందుకే గుజరాత్ ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారు. 2024లో కూడా కేంద్రంలో అధికారం భారతీయ జనతా పార్టీదే’’నని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.