PM Modi: ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోదీ ధ్యానం చేసేది అక్కడే.. ప్రత్యేకత ఎంటో తెలుసా..?

లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి దశకు చేరుకున్నాయి. ఏడో, చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ప్రతిసారీ మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ర్యాలీలు నిర్వహించారు. రోజులో నాలుగైదు ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని మోదీ చివరి ర్యాలీ మే 30న జరగనుంది. దీంతో చివరి దశ ప్రచారానికి తెరపడనుంది.

PM Modi: ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోదీ ధ్యానం చేసేది అక్కడే.. ప్రత్యేకత ఎంటో తెలుసా..?
PM Modi
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 28, 2024 | 3:40 PM

లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి దశకు చేరుకున్నాయి. ఏడో, చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ప్రతిసారీ మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ర్యాలీలు నిర్వహించారు. రోజులో నాలుగైదు ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల కోసం ప్రధాని మోదీ చివరి ర్యాలీ మే 30న జరగనుంది. దీంతో చివరి దశ ప్రచారానికి తెరపడనుంది. ర్యాలీ అనంతరం ప్రధాని మోదీ తమిళనాడుకు చేరుకుంటారని సమాచారం. 30వ తేదీ రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత, ప్రధాని మోదీ కన్యాకుమారి వెళతారు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తారని తెలుస్తోంది.

మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాత తమిళనాడు వెళ్లి అక్కడ రాత్రికి విశ్రాంతి తీసుకోనున్నారు. మే 31 నుంచి జూన్ 1వ తేదీ వరకు సంబంధించిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమం ఇంకా విడుదల కాలేదు. అయితే 2019 ఎన్నికలలో చివరి దశ ఓటింగ్ సమయంలో ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌కు వెళ్లి అక్కడ రుద్ర గుహలో ధ్యానం చేశారు. ఈసారి మాత్రం తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వివేకానంద రాక్ మెమోరియల్ విశిష్టత..

స్వామి వివేకానంద 1893లో ప్రపంచ మతాల మండలిలో పాల్గొనేందుకు అమెరికాలోని చికాగో వెళ్లారు. ఇక్కడ ఆయన ప్రసంగం ప్రతిధ్వని ప్రపంచమంతా వినిపించింది. ఇప్పటి కూడా ఆయన ప్రసంగం మహా గొప్పగా కొనయాడుతారు. ఆ పర్యటనకు ముందు ఆయన 1892 డిసెంబర్ 24న కన్యాకుమారిని సందర్శించారని చెబుతారు. ఇక్కడ సముద్ర తీరానికి దాదాపు 500 మీటర్ల దూరంలో నీటి మధ్య భారీ బండ కనిపించింది. ఈదుకుంటూ అక్కడికి చేరుకుని ధ్యానంలో మునిగిపోయారు. చివరికి అతను తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవసరమైన జ్ఞానాన్ని సాధించారు. అందుకే విశ్వఖ్యాతి సంపాదించి నరేంద్రుడు వివేకానందుడు అయ్యాడు.

1970లో స్వామి వివేకానందకు అంకితం చేసిన గొప్ప స్మారక భవనాన్ని ఈ శిల సమీపంలో నిర్మించారు. ఇందులో నాలుగు మంటపాలు ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణ వివరాలు పురాతన శైలిలో ఉంటాయి. దీని 70 అడుగుల ఎత్తైన గోపురం ఎరుపు, నీలం గ్రానైట్‌తో నిర్మించారు. ఈ స్థలం 6 ఎకరాల్లో విస్తరించి ఉంది.

ఇక్కడ 4 అడుగుల ఎత్తైన వేదికపై స్వామి వివేకానంద పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కంచుతో చేసిన ఈ విగ్రహం ఎత్తు దాదాపు ఎనిమిదిన్నర అడుగులు. ఈ రాయికి సంబంధించి మరో కథ కూడా ఉంది. సముద్రపు నీటిలో ఉన్న ఈ రాతిపై కన్యాకుమారి దేవి శివుడిని పూజిస్తూ తపస్సు చేసిందని ప్రతీతి. అతని పాదముద్రలు కూడా ఇక్కడ దొరికాయి. అందుకే ఈ ప్రదేశం మతపరమైన ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. స్మారక చిహ్నంలో నమస్తుభ్యం జగదాంబ అనే అసెంబ్లీ హాలు, సభా మండపం కూడా ఉన్నాయి.

ఈ స్మారక చిహ్నం ఐక్యతకు చిహ్నం, ఎందుకంటే దేశం మొత్తం దాని కోసం పని చేసింది. దీని ప్రారంభోత్సవంలో అన్ని రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఈ స్మారక చిహ్నాన్ని కచ్చి కామకోటి పీఠం పరమాచార్య రూపొందించారు. మొదటి విరాళాన్ని చిన్మయ మిషన్‌కు చెందిన స్వామి చిన్మయానంద అందించారు. ఇందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సహకరించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles