కార్గిల్ యుద్ధంలో వాడిన ఆయుధాలు ఏవో తెలుసా..?

TV9 Telugu

27 July 2024

కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 25 సంవత్సరాలు. దేశంలో ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

కార్గిల్ యుద్ధంలో బోఫోర్స్ ఫిరంగి నిర్ణయాత్మక పాత్ర యుద్ధ చిత్రాన్ని మార్చింది. 70 డిగ్రీల వరకు తిరిగే దాని బారెల్ శత్రువును నాశనం చేసింది.

DRDO తయారు చేసిన పినాక మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ యుద్ధంలో శత్రు పదాతిదళానికి ఎక్కువ నష్టం కలిగించింది.

భారత సైన్యానికి చెందిన వీర సైనికులు శత్రువులను చంపడానికి యుద్ధంలో ఇన్సాస్ రైఫిల్‌ను ఉపయోగించారు. ఈ రైఫిల్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసింది.

SAF కార్బైన్ 2-A-1 తుపాకీ (స్టెర్లింగ్ సబ్‌మెషిన్ గన్) 1-A-1 సైలెంట్ వెర్షన్. దాని బారెల్‌లో సైలెన్సర్ అమర్చారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారుచేసారు.

సోవియట్ రష్యా తయారు చేసిన డ్రాగునోవ్ స్నిపర్ రైఫిల్ కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడించింది. రైఫిల్ 7.62×54 mm క్యాట్రిడ్జ్‌ని ఉపయోగిస్తారు.

కార్గిల్ యుద్ధంలో, భారత సైన్యం కార్ల్ గుస్తావ్ రాకెట్ లాంచర్‌తో అనేక శత్రు బంకర్‌లను ధ్వంసం చేసింది.

NSV హెవీ మెషిన్ గన్‌లు, AK-47 అసాల్ట్ రైఫిల్స్, గ్రెనేడ్ లాంచర్లు, లేజర్ గైడెడ్ బాంబులతో పాటు మిరేజ్-2000 యుద్ధ విమానాలు శత్రువులను ఓడించిన భారత ఆర్మీ ఫ్లీట్‌కు గొప్ప వరం.