డస్ట్‌బిన్ లేకుంటే ఈ రాష్ట్రంలోకి నో ఏంట్రీ..!

TV9 Telugu

27 July 2024

డస్ట్‌బిన్ లేకుండా ఈ రాష్ట్రంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు.. అది లేకుండా పర్యాటకులను రాష్ట్రంలోనికి అనుమతించరు.

మీరు వాకింగ్‌కు వెళ్లేటప్పుడు ఏదైనా చెత్తను రోడ్డుపై విసిరితే ఇక అంతే సంగతులు. దీని కోసం, మీరు మీతో ఒక డస్ట్‌బిన్‌ని ఉంచుకోవల్సిందే!

దేశంలోని సిక్కిం రాష్ట్రంలో ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. మీరు ఇక్కడికి వెళ్లబోతున్నట్లయితే, ఖచ్చితంగా మీతో ఒక చెత్తబుట్టను తీసుకెళ్లండి.

సిక్కింలోకి ప్రవేశించే అన్ని టూరిస్ట్ వాహనాలు ఇప్పుడు తప్పనిసరిగా పెద్ద చెత్త బ్యాగ్‌ని తీసుకెళ్లాల్సి ఉంటుందని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏదైనా వాహనంలో చెత్త సంచులు లేదా చెత్త పెట్టెలు లేకుంటే, వాటిని సిక్కిం రాష్ట్రంలోకి అస్సలు అనుమతించరు.

పర్యావరణ సుస్థిరత లక్ష్యాన్ని సాధించడంలో సమాజ భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ జారీ చేసిన ఉత్తర్వు పేర్కొంది.

చెత్త సంచుల వినియోగం గురించి పర్యాటకులకు అవగాహన కల్పించడం టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, వాహన డ్రైవర్ల బాధ్యత అని పేర్కొన్నారు.

చెత్త పారవేయడం, పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరతపై పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.