Megastar Chiranjeevi: చరణ్ బుగ్గ గిల్లుతున్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో చాలా ఫేమస్..

చిన్నప్పుడు చూడటానికి ఎంతో క్యూట్ గా ఉన్న ఆ చిన్నోడు కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చాలా కాలంగా సైలెంట్ అయిన ఆ కుర్రాడు.. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇంతకీ చరణ్ బుగ్గ గిల్లుతున్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా.

Megastar Chiranjeevi: చరణ్ బుగ్గ గిల్లుతున్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా..? ఇండస్ట్రీలో చాలా ఫేమస్..
Chiranjeevi
Follow us

|

Updated on: Jul 27, 2024 | 10:57 AM

సెలబ్రెటీల చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా పాపులర్ నటీనటులు చైల్డ్ హుడ్ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నెట్టింట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటో తెగ వైరలవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు స్టార్ హీరోస్. అందులో రామ్ చరణ్ ఒకరని తెలిసిన విషయమే. కానీ చరణ్ బుగ్గ గిల్లుతున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ హీరో. చిన్నప్పుడు చూడటానికి ఎంతో క్యూట్ గా ఉన్న ఆ చిన్నోడు కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చాలా కాలంగా సైలెంట్ అయిన ఆ కుర్రాడు.. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఇంతకీ చరణ్ బుగ్గ గిల్లుతున్న ఆ చిన్నోడు ఎవరో తెలుసా.. ఇంకెవరు.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు హీరో అల్లు శిరీష్.

అల్లు శిరీష్, రామ్ చరణ్ చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో చాలా కాలంగా వైరలవుతున్నాయి. కానీ ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న శిరీష్.. ఓ ఇంటర్వ్యూలో ఈ ఫోటో గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తన ఫస్ట్ బర్త్ డే రోజున మెగాస్టార్ చిరంజీవి తనను, రామ్ చరణ్ ఇద్దరిని ఎత్తుకున్నారని.. ఆ సమయంలో తాను చరణ్ బుగ్గగిల్లుతున్నానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాను చూశానని.. అందులో చరణ్ బుగ్గగిల్లుతున్నట్లుగా ఉందని అన్నారు. అలాగే తన ఫేవరేట్ కజిన్ రామ్ చరణ్ గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఊర్వశివో రాక్షసివో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన శిరీష్.. ఇప్పుడు బడ్డీ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

View this post on Instagram

A post shared by Allu Sirish (@allusirish)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!