
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విదేశీ పర్యటనలు సాగిస్తున్నారు. ఇటీవలె ఎనమిది రోజుల్లో ఐదు దేశాలు చుట్టివచ్చిన ప్రధాని తాజాగా రెండు దేశాల పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులు విదేశీ పర్యటనకు వెళుతున్నారు ప్రధాని మోదీ. యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవుల్లో ప్రధాని పర్యటించనున్నారు. నాలుగు రోజుల్లో రెండు దేశాల్లో పర్యటిస్తారు మోదీ. బ్రిటన్‌కు నాలుగోసారి, మాల్దీవులకు మూడోసారి వెళుతున్నారు ప్రధాని మోదీ.
ముందుగా యూకే వెళ్తున్న మోదీ అక్కడి ప్రధాని కౌంటర్ కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి, బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సంబంధిత అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు అప్పగించడంపై చర్చిస్తారు. వ్యాపారం, సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణలపై పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చిస్తారు. ఇండియాలో 36 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 6వ అతిపెద్ద పెట్టుబడిదారుగా యూకే ఉంది.
ఇక జూలై 25 నుంచి రెండు రోజులు మాల్దీవుల్లో పర్యటిస్తారు ప్రధాని. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానం మేరకు వెళ్తున్నారు. జూలై 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. అక్కడి అధ్యక్షుడు ముయిజుతో సమావేశం నిర్వహించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. మాల్దీవులకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఉంది. రక్షణచ, భద్రతా సహకారాన్ని కలిగి ఉంది భారత్. ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 500 మిలియన్ డాలర్లుగా కొనసాగుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడి ఒప్పందంపై రెండు దేశాలు చర్చిస్తాయి. పునరుత్పాదక ఇంధనం, మత్స్య సంపద సహా కొత్త సహకార రంగాలపై పని చేస్తున్నాయి ఇరు దేశాలు. మాల్దీవుల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో మాల్దీవుల రక్షణ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో సాయమందిస్తోంది భారత్.