PM Modi: వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని ఎర్నాకుళంలో పర్యటించిన ప్రధాని మోదీ పశ్చిమాసియా యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. భారతీయులు అక్కడ చిక్కుకోవాలని కాంగ్రెస్‌ కాంక్షిస్తోందని.. కాంగ్రెస్‌ యువరాజు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

PM Modi: వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Modi Kerala Speech

Updated on: Mar 11, 2026 | 4:00 PM

కేరళ ఎర్నాకుళం సభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. పశ్చిమాసియా యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా యుద్ధంతో లక్షలాదిమంది భారతీయులు చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. భారతీయులు అక్కడ చిక్కుకోవాలని కాంగ్రెస్‌ కాంక్షిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ. యుద్ధం పేరుతో తనను తిట్టడమే పనిగా కాంగ్రెస్‌ నేతలు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్దాన్ని కూడా కాంగ్రెస్‌ తన స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు .

గల్ఫ్‌ యుద్దం అందరికి మరో గుణపాఠం నేర్పిందన్నారు ప్రధాని మోదీ. ఇంధన రంగంలో ఆత్మనిర్భరతకు కృషి చేస్తుందన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే కేరళను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. దేశ యువతపై రాహుల్‌గాంధీకి ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. కేరళ యువత డ్రోన్లను తయారు చేస్తున్న విషయంపై రాహుల్‌గాంధీకి ఇప్పటికి కూడా అవగాహన లేదన్నారు. భారత అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ యువరాజు తట్టుకోలేకపోతున్నారని మిర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us