PM Modi-Putin Phone Talk: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ అంశంపైనే మాట్లాడినట్లుగా సమాచారం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో టెలిఫోన్‌లో సంభాషించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, జీ-20 దేశాల సమావేశాలతోపాటు..

PM Modi-Putin Phone Talk: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ అంశంపైనే మాట్లాడినట్లుగా సమాచారం
Pm Modi Putin Phone Talk

Updated on: Dec 16, 2022 | 4:59 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. భారత్-చైనా మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో ఇరువురు నేతల మధ్య ఈ సంభాషణ జరిగడం ఇప్పుడు ప్రధానంశంగా మారింది. ఇటీవల చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోకి చొరబడ్డారని, ఆ తర్వాత వారు భారత సైన్యంతో ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం (డిసెంబర్ 16) ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు.

ఇరువు నేతల మధ్య టెలిఫోనిక్ సంభాషణ జరిగింది. సెప్టెంబరు 16న ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఇటీవల సమావేశమయ్యారు. ఇది యుద్దాలు చేసుకునే సమయం కాదని.. సమస్యను చర్చల ద్వారానే చర్చించుకోవాలని ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే.

అయితే, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన చర్చల్లో ప్రధాని మోదీ ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సమర్‌కండ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఇంధన సహకారం, వాణిజ్యం,పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహకారం, ఇతర కీలక రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాల వంటి అనేక అంశాలను సమీక్షించారు.

మోడీ-పుతిన్‌ల మధ్య జరిగిన చర్చ ఇదే..

G-20కి భారత్ ప్రస్తుత ఛైర్మన్‌షిప్ గురించి ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది. సమావేశాల ప్రాధాన్యతలను హైలైట్ చేశారని PMO తెలిపింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు భారతదేశం ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వారు ఒకరితో ఒకరు నిరంతరం సంప్రదించడానికి అంగీకరించారు. ఈ ఏడాది ఇద్దరు నేతల మధ్య పలుమార్లు టెలిఫోన్ సంభాషణలు జరిగిన సంగతి తెలిసిందే.

రష్యా-ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది

తొమ్మిది నెలలు. వేల మంది సైనికుల మరణం. ఇరు దేశాలు తగ్గడం లేదు.  ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న భీకర యుద్ధంలో వేల మంది సైనికులు చనిపోయినట్లు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ప్రధానంగా రష్యా వైపు భారీస్థాయిలో ప్రాణనష్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత 9 నెలలో 1500 మందికి పైగా రష్యా సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదిక పేర్కొంది. అందులో 160 మందికిపైగా జనరల్‌ స్థాయి అధికారులున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన రిపోర్ట్‌లను బట్టి తెలుస్తోంది.

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్యలో, రష్యా అనేకసార్లు అణు దాడిని బెదిరించింది. ఇటీవల, వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అణు దాడి గురించి బెదిరించారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ పుతిన్ పరోక్షంగా బెదిరించడంతో మోదీ-పుతిన్ సమ్మిట్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను రష్యా ఖండించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించడంపై వచ్చిన కథనాలను ఖండించారు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ.

మరిన్ని జాతీయ వార్తల కోసం