సీతాకోక చిలకమ్మా ! నీకు మోదీ స్వేఛ్చనిచ్చారమ్మా !

| Edited By:

Sep 17, 2019 | 3:58 PM

తన 69 వ బర్త్ డే సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లోని బటర్ ఫ్లై పార్క్ లో రంగురంగుల సీతాకోక చిలుకలను బాస్కెట్ నుంచి వదిలారు. నర్మదా జిలాల్లోని కెవడీయలో గల ఈ పార్క్ లో వీటితో నిండిన బుట్ట నుంచి చిరునవ్వులు చిందిస్తూ వాటిని ఆయన స్వేచ్చ్చా ప్రపంచంలోకి విడుదల చేశారు. రాష్ట్ర సీతాకోక చిలుకగా కాషాయ రంగున్న (బీజేపీ ?) చిలుకను ఆయన ఎంపిక చేయడం విశేషం. అంతకుముందు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని, […]

సీతాకోక చిలకమ్మా ! నీకు మోదీ స్వేఛ్చనిచ్చారమ్మా !
Follow us on

తన 69 వ బర్త్ డే సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లోని బటర్ ఫ్లై పార్క్ లో రంగురంగుల సీతాకోక చిలుకలను బాస్కెట్ నుంచి వదిలారు. నర్మదా జిలాల్లోని కెవడీయలో గల ఈ పార్క్ లో వీటితో నిండిన బుట్ట నుంచి చిరునవ్వులు చిందిస్తూ వాటిని ఆయన స్వేచ్చ్చా ప్రపంచంలోకి విడుదల చేశారు. రాష్ట్ర సీతాకోక చిలుకగా కాషాయ రంగున్న (బీజేపీ ?) చిలుకను ఆయన ఎంపిక చేయడం విశేషం. అంతకుముందు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని, సర్దార్ సరోవర్ డ్యాం ను మోదీ సందర్శించి ఈ డ్యాం వద్ద ప్రార్థనలు చేశారు. తొలుత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఏరియల్ సర్వే చేశారు. గత అక్టోబరులో మోదీ ఈ విగ్రహాన్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా-అనేకమంది రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

అమ్మా ! అన్నం పెట్టు ! తల్లితో మోదీ లంచ్

చాలాకాలం తరువాత మోదీ తన తల్లి హీరాబెన్ తో కలిసి మంగళవారం మధ్యాహ్నం లంచ్ చేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. 98 ఏళ్ళ హీరాబెన్ తన చిన్న కొడుకు పంకజ్ మోదీతో కలిసి రైసిన్ గ్రామంలో ఉంటున్నారు. తల్లితో కలిసి భోజనం చేసిన అనంతరం మోదీ కొద్దిసేపు ఇరుగు పొరుగువారితో మాటామంతీ జరిపారు.