మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా గురువారం ఆయనకు నివాళులర్పించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 1944 ఆగష్టు 20న ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు. 1984 అక్టోబరులో ఆయన దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రికార్డు కూడా ఆయనదే. 1989 డిసెంబర్ 2 వరకూ ప్రధానిగా పని చేశారు రాజీవ్ గాంధీ. కాగా మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాందీ మృతి చెందారు. ఈ రోజును కాంగ్రెస్ పార్టీ సద్భావన దివాస్‌గా పాటిస్తున్న విషయం తెలిసిందే.
On his birth anniversary, tributes to former Prime Minister Shri Rajiv Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) August 20, 2020
Read More:
వచ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ రేషన్’