PM Modi: సీజేఐ ఇంట గణేష్ పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్

|

Sep 12, 2024 | 6:23 AM

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణేష్ పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్, ఆయన భార్య కల్పనా దాస్‌తో కలిసి ప్రధాని మోదీ గణనాధుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక తమ నివాసానికి విచ్చేసిన..

PM Modi: సీజేఐ ఇంట గణేష్ పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్
Pm Modi Chandrachud
Follow us on

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణేష్ పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్, ఆయన భార్య కల్పనా దాస్‌తో కలిసి ప్రధాని మోదీ గణనాధుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక తమ నివాసానికి విచ్చేసిన ప్రధాని మోదీని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఆయన సతీమణీ కల్పనా దాస్ సాదరంగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా టోపీ ధరించి పూజలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. గణేషుడికి హారతి ఇచ్చే ఫోటోలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సీజేఐ చంద్రచూడ్ మహారాష్ట్రకు చెందినవారని తెలిసిందే. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి అతి ముఖ్యమైన పండుగ. ముంబైలో జన్మించిన చంద్రచూడ్ తన బాల్యాన్ని మహారాష్ట్రలోని గడిపారు. ముంబై విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన చంద్రచూడ్.. ఆ తర్వాత హార్వర్డ్ లా స్కూల్‌లో తదుపరి విద్యను అభ్యసించాడు. LLB, LLM డిగ్రీలలో పట్టా సాధించాడు. ఇక ఆయన న్యాయవాద వృత్తి ముంబైలో ప్రారంభమైంది. అక్కడ ఆయన మొదట ముంబై హైకోర్టులో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించారు.