గోల్డ్ రేట్ల పతనంపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్.. సికింద్రాబాద్ పిలుపును గుర్తుచేస్తూ ఏమన్నారంటే?

బంగారం ధరలు పడిపోతున్న వేళ గోల్డ్‌ రేట్‌పై ప్రధాని మోదీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మాట విని దేశ ప్రజలు బంగారం కొనడం తగ్గించడంతో పసిడి ధరలు దిగివచ్చాయన్నారు. ఈ ఏడాది మేలో సికింద్రాబాద్‌ వేదికగా ప్రజలకు ఇచ్చిన పిలుపును లక్నో సభలో గుర్తు చేశారు. ప్రజల పొదుపు మంత్రంతోనే బంగారం ధర దిగొస్తుందంటూ ప్రశంసించారు.

గోల్డ్ రేట్ల పతనంపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్.. సికింద్రాబాద్ పిలుపును గుర్తుచేస్తూ ఏమన్నారంటే?
Pm Modi On Gold Price Crash

Updated on: Nov 22, 2026 | 8:02 AM

అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనొద్దంటూ కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు మరోసారి చర్చకొస్తోంది. ఎందుకంటే.. ఈ ఏడాది జనవరిలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పీక్స్‌కు చేరాయి. అప్పటి పరిణామాలతో మే 10న సికింద్రాబాద్ వేదికగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని సూచించారు. మోదీ పిలుపు ఇచ్చిన మూడు రోజులకే.. మే 13న బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పరిస్థితులు మలుపు తిరిగాయి. దీంతోపాటు.. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల పరిణామాలతో మార్కెట్ సెంటిమెంట్ మారి, పసిడి ధరలు ఒక్కసారిగా పడిపోవడం మొదలైంది. ఎంతలా అంటే.. ఊహించని రేంజ్‌లో బంగారం ధర పతనం అవుతోంది. ఈ క్రమంలోనే.. నిన్న లక్నోలో పర్యటించిన ప్రధాని మోదీ.. పసిడి ధరల తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మే 10న సికింద్రాబాద్ సభలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపును గుర్తుచేశారు. బంగారం కొనొద్దని చెప్పిన తన మాట విని దేశ ప్రజలు బంగారం తక్కువగా కొన్నారన్నారు. ఫలితంగా బంగారం ధరలు పడిపోయాయన్నారు. బంగారం కొనకపోవడంతో డబ్బులు మిగిలాయని ప్రజలు సంతోషపడుతున్నారని మోదీ తెలిపారు.

ఇక.. మేలో సికింద్రాబాద్‌ వేదికగా ప్రధాని మోదీ అప్పటి బంగారం ధరలు, కొనుగోళ్లపై ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. బంగారం దిగుమతితో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎక్కువగా ఖర్చవుతున్నాయన్నారు. దేశ హితం కోసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మే 10న సికింద్రాబాద్‌ సభలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌ను ఒక్కసారి చూద్దాం..

మొత్తంగా.. బంగారం ధరలు పడిపోతున్నవేళ కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ సికింద్రాబాద్‌ సభలో చేసిన కామెంట్స్‌ అందరికీ గుర్తుకొస్తున్నాయి. అందరితోపాటు ఆయనకు కూడా గుర్తొస్తున్నాయి. లక్నో సభ వేదికగా ఆ మాటలను మోదీ గుర్తు చేశారు. ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించడం వల్లే ధరలు దిగివచ్చాయని, ఫలితంగా సామాన్యుల డబ్బు ఆదా అయిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఏదేమైనా.. ఒకవైపు ప్రభుత్వ పన్నుల నిర్ణయాలు.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ మార్పులు.. పసిడి ప్రియులకు ఊరటనిచ్చే గోల్డెన్ మూమెంట్స్ తీసుకొచ్చాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us