ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన వేళ ‘సేవ’ ఉత్సవాలు! రూ. 18,777 కోట్ల ప్రాజెక్టులు షురూ!

గుజరాత్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో ప్రగతి పరుగులు పెడుతోంది. రాష్ట్ర రూపురేఖలను సమూలంగా మార్చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తాజా పర్యటనలో భాగంగా గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతం దమన్‌లలో కలిపి మొత్తం రూ. 18,777 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన వేళ ‘సేవ’ ఉత్సవాలు! రూ. 18,777 కోట్ల ప్రాజెక్టులు షురూ!
Pm Modi Gujarat Visit

Updated on: Jun 05, 2026 | 8:17 PM

గుజరాత్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో ప్రగతి పరుగులు పెడుతోంది. రాష్ట్ర రూపురేఖలను సమూలంగా మార్చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తాజా పర్యటనలో భాగంగా గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతం దమన్‌లలో కలిపి మొత్తం రూ. 18,777 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.

సూరత్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్టులతో పాటు పలు కీలక పనులను జాతికి అంకితం చేశారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గుజరాత్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ పరిధిలో పట్టాలెక్కిన పనులను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా రూ. 1,063 కోట్ల వ్యయంతో కూడిన ఎనిమిది కీలక ప్రాజెక్టులకు ప్రధాని పునాది వేశారు. అనంతరం సూరత్ జిల్లాలోని ఎల్ అండ్ టీ పారిశ్రామిక సముదాయాన్ని సందర్శించి, రక్షణ రంగంలో దేశీయ సాంకేతిక పురోగతిని, స్వయంసమృద్ధ భారత నిర్మాణంలో వారి సేవలను ప్రధాని కొనియాడారు.

దమన్‌లో ‘నమో ఎయిర్‌పోర్ట్, నమో హాస్పిటల్’ ప్రారంభం

అటు కేంద్రపాలిత ప్రాంతం దమన్‌లోనూ ప్రధాని మోదీ పర్యటన సంచలనంగా మారింది. అక్కడ దాదాపు రూ. 2,970 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ‘నమో ఎయిర్‌పోర్ట్’, ‘నమో హాస్పిటల్’లను ప్రధాని ప్రారంభించారు. వీటితో పాటు దాద్రా నగర్ హవేలీ, లక్ష్వద్వీప్ ప్రాంతాలలో మౌలిక వసతులు, పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన మొత్తం 56 ప్రాజెక్టులకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరోవైపు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సేవ అనే నినాదంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారికంగా సేవా కార్యక్రమాలు, సంక్షేమ పండుగలను జరుపుతుండటంతో గుజరాత్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us