AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ.2 లక్షల జీతంతో Indian Army SSC టెక్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు

ఇండియన్‌ ఆర్మీలో అధికారిణిగా దేశ సేవ చేయాలనుకునే మహిళా ఇంజినీర్లకు సువర్ణావకాశం లభించింది. 2027 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 68వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (టెక్‌) మహిళా కోర్సులో ప్రవేశాల కోసం ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనుండగా, అవివాహిత ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లతో పాటు డిఫెన్స్‌ పర్సనల్‌ వితంతువుల నుంచి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..

నెలకు రూ.2 లక్షల జీతంతో Indian Army SSC టెక్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు
Indian Army Ssc Tech Women Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 10, 2026 | 6:02 PM

Share

ఇండియన్‌ ఆర్మీ 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సులో చేరడానికి అర్హత కలిగిన అవివాహిత ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానినిస్తూ ఇండియన్‌ ఆర్మీ SSC టెక్‌ 2027 ఏప్రిల్‌ కోర్సు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే డిఫెన్స్ ప‌ర్సన‌ల్ విడోస్ (ఎస్‌ఎస్‌సీ(W) టెక్‌ 68, ఎస్‌ఎస్‌సీ(W) నాన్‌ టెక్‌, నాన్‌ యూపీఎస్సీ 125) పోస్టులకు కూడా ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతోంది. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికై వారికి ప్రి-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA) లో కోర్సు నిర్వహిస్తారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • షార్ట్‌ సర్వీస్‌ కమీషన్‌ (టెక్‌) 68 పోస్టుల సంఖ్య: 29
  • విడోస్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ పర్సనల్‌ పోస్టుల సంఖ్య: 2
  • ఎస్‌ఎస్‌సీ (W) (టెక్‌) 68 పోస్టుల సంఖ్య: 1
  • ఎస్‌ఎస్‌సీ (W) (నాన్‌-టెక్‌)(నాన్‌ యూపీఎస్సీ) 125 పోస్టుల సంఖ్య: 1

ఇండియన్‌ ఆర్మీ – 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఫైనల్ ఇయర్‌ చదువుతున్న విద్యార్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీలోపు డిగ్రీ పూర్తి చేయాలి. ఎస్‌ఎస్‌సీ(డబ్ల్యూ)(నాన్‌ టెక్‌) పోస్టులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 1 ఏప్రిల్‌ 2027 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2000 నుంచి మార్చి 31, 2007 మధ్య జన్మించి ఉండాలి. వితంతు అభ్యర్థులకు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రాడ్యుయేషన్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ట్రైనింగ్ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు.

ఇండియన్‌ ఆర్మీ – 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) కోర్సు 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us