ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్..వారందరికీ అభినందనలు

| Edited By: Pardhasaradhi Peri

May 20, 2020 | 1:29 PM

పేదలకు ఆస్పత్రి ఖర్చులు పెనుభారమవుతున్న నేపథ్యంలో ఎంతోమంది జీవితాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం వెలుగులు నింపుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లబ్ధిదారులతో పాటు..

ప్రధాని మోదీ ప్రత్యేక ట్వీట్..వారందరికీ అభినందనలు
Follow us on

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత్. ఈ పథకం ప్రారంభించిన రెండేళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు కోటి మందికి చేరుకున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. పథకం ప్రారంభించిన రెండు సంవత్సరాల కాలంలోనే ఇంతమంది లబ్ధిదారులు చేరడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా దేశంలో 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతాయని సర్కార్ యోచన. పేదలకు ఆస్పత్రి ఖర్చులు పెనుభారమవుతున్న నేపథ్యంలో ఎంతోమంది జీవితాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం వెలుగులు నింపుతుందని ప్రధాని పేర్కొన్నారు. లబ్ధిదారులతో పాటు వారి కుటుంబాలకు మోదీ అభినందనలు తెలిపారు. వారందరూ ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.. అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.