మోదీ ఇచ్చింది నాట్ జస్ట్ స్టేట్‌మెంట్! వార్‌కు ముందు సైరెన్!

మార్నింగ్ అరౌండ్ 9.30కి న్యూస్ యాప్స్ నుంచి ఓ నోటిఫికేషన్ చూసుంటారు. స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే అని. ఈ ట్రంప్ గానీ మళ్లీ ఏదైనా చేసుంటారా అని ఓపెన్ చేస్తే.. అందులో ప్రధాని మోదీ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ కనిపించి ఉంటుంది. అదో పార్టీ మీటింగ్ అనే భావించారు గానీ.. వార్‌కు ముందు సైరన్ అని అప్పుడనుకోలేదు. స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్ చూడగానే అర్థమైంది అందరికి. మోదీ ఇచ్చింది స్టేట్‌మెంట్ కాదు అదొక వార్నింగ్ సిగ్నల్ అని. పొలిటికల్‌గా, ఒక పొలిటీషియన్‌గా నరేంద్ర మోదీ ఎంత అగ్రెసివ్‌గానైనా మాట్లాడొచ్చు. కాని, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మ్యాటర్ అయితే మాత్రం.. ప్రతి అక్షరాన్ని, ప్రతి పొల్లును కొలతకొలిచినట్టు మరీ మాట్లాడతారు. అంతా సుభిక్షం, అంతా ప్రశాంతం అనాల్సిన మూమెంట్‌లో... 'జాగ్రత్తగా ఉండండి' అని అన్నారంటే, కచ్చితంగా 'దేశం క్లిష్ట పరిస్థితి'లో ఉందనే అర్థం. భయపెట్టాలని కాదు గానీ.. దేశ ప్రజలను ముందస్తుగా ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఆ మాటల్లో. 'ఇప్పుడు చెప్పే 9 పొదుపు సూత్రాలు పాటిస్తే ఆల్ ఈజ్ వెల్.. లేదంటే ప్రమాదంలో పడతాం' అనే హెచ్చరిక చేశారు. ఇంకో విషయం.. మిడిల్ క్లాస్, ఏది కొనాలన్నా జేబులు తడుముకునే సెక్షన్ ఉంది చూశారూ.. వాళ్లకో ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్. ముందున్నది గడ్డుకాలం. ధరలు పెరగొచ్చు. కొనే శక్తి ఉన్నా దొరక్కపోవచ్చు. సేవింగ్స్ మొత్తం ఖర్చైపోవచ్చు. ఏదైనా జరగొచ్చు. మోదీ మాటలను డీకోడ్ చేస్తే వచ్చే అర్థం ఇదే. ఇంతకీ.. ఏం జరగబోతోంది మున్ముందు? ఎందుకని ఆ 9 సూత్రాలు పాటించాలంటున్నారు? కంప్లీట్ డిటైల్స్...

మోదీ ఇచ్చింది నాట్ జస్ట్ స్టేట్‌మెంట్! వార్‌కు ముందు సైరెన్!
Economic Crisis

Updated on: May 11, 2026 | 9:50 PM

ఏదో ఆర్థిక తుఫాన్ దేశ తీరంలో సుడులు తిరుగుతోంది. ఏ క్షణాన్నైనా తీరం దాటొచ్చనే సంకేతమైతే కనిపిస్తోంది. ప్రధాని మోదీ చాలా క్యాజువల్‌గా చెప్పినట్టు కనిపించిన ఆ పొదుపు సూత్రాలు.. ఏదో ఆర్థిక విపత్తుకు, ప్రమాదానికి హింట్ ఇస్తున్నాయ్. పైగా.. ఆ 9 పొదుపు సూత్రాల్లోని ప్రతి ఒక్క పాయింట్ డాలర్‌కే కనెక్ట్ అవుతోంది. దేశ ఖజానాలో ఉన్న ప్రతి ఒక్క డాలర్‌ని కాపాడుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. కారణం.. ఆ డాలర్లే కరిగిపోయిన నాడు దేశంలో ధరల విస్ఫోటనం జరుగుతుంది. ఉప్పు నుంచి ఉక్కు వరకు ప్రతి ఒక్క వస్తువు ధర పెరుగుతుంది. పైగా.. ఈసారి ఎల్‌నినో ముంచుకొస్తోంది. వందేళ్లలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తు రాబోతోంది. ఆ విపత్తుకు ఆర్థిక విపత్తు తోడైతే.. జరగబోయే నష్టం ఊహకు కూడా అందదు. అందుకేనా ఈ జాగ్రత్త. ఏదో ఆర్థిక విపత్తు రాబోతోందన్న సంకేతం కనిపిస్తోంది సరే. మరి.. ప్రజలు బంగారం కొనొద్దని అంత పర్టిక్యులర్‌గా ఎందుకన్నారు? ఓ ఏడాది పాటు గోల్డ్ కొనడం ఆపేద్దాం అని దేశ ప్రజలకు ఎందుకు పిలుపునిచ్చారు? రీజన్.. అదే పెద్ద ఇష్యూ కాబట్టి. ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ఆ మాట అనగానే దేశంలోని బంగారం వ్యాపారులంతా ఉలిక్కిపడ్డారు....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి