రైతన్నకు శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లీ రూ.2,000

|

Jul 30, 2020 | 5:57 PM

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మరోసారి తీపికబురు అందించింది. ఆగస్ట్ నెల 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ రైతుల కోసం..

రైతన్నకు శుభవార్త.. బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లీ రూ.2,000
Follow us on

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు మరోసారి తీపికబురు అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా అందిస్తున్న డబ్బులను మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. ఆగస్ట్ నెల 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా వారికి ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే.

మూడు విడతల రూపంలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులు వచ్చి చేరతాయి. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరో విడత డబ్బులను ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలో కేంద్రం జమచేయనుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో..లేదో తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Read More:

ఇళ్లలోనే వినాయకుడి వేడుకలు: మంత్రి ఐకే రెడ్డి పిలుపు

శ్రీవారిని దర్శించుకున్న ‘రష్యా యువతి’

ఆ జిల్లా ‘పెద్దపులుల సంతానోత్పత్తి’ కేంద్రం!

రాయలసీమ ఎత్తిపోతలకు కృష్ణా బోర్డు బ్రేక్