బిగ్ బ్రేకింగ్.. చైనా-భారత్‌ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో 19న అఖిలపక్షం భేటీ

సోమవారం భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావరణం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందరు

బిగ్ బ్రేకింగ్.. చైనా-భారత్‌ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో 19న అఖిలపక్షం భేటీ

Edited By:

Updated on: Jun 17, 2020 | 2:42 PM

సోమవారం భారత్‌-చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావరణం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందరు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 19న సాయంత్రం 5.00 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం పంపారు. అయితే ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.

కాగా, సోమవారం జరిగిన ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 45 మంది చైనాకు చెందిన జవాన్లు కూడా మరణించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో గాయపడ్డట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా లడాక్ లోని గల్వాన్ ప్రాంతంలో సరిహద్దు దాటుతూ చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది.

ఇక దేశవ్యాప్తంగా చైనా తీరును నిరసిస్తూ.. ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పలుచోట్ల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా తీరుపై మండిపడ్డారు. వారికి ఎంత ధైర్యం ఉంటే మన సైనికులను చంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ నోరు మెదపాలంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా శుక్రవారం నాడు సాయంత్రం 5.00 గంటలకు అఖిలపక్ష భేటీకి పిలుపునివ్వడం గమనార్హం.

Follow Us