రాజస్థాన్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన సచిన్ వర్గం..

| Edited By:

Jul 15, 2020 | 4:30 AM

రాజస్థాన్‌ రాజకీయాలు మరింత హాటెక్కాయి. డిప్యూటీ సీఎం పదివితో పాటు పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి సచిన్ పైలట్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచిన్ పైలట్‌ వర్గం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర..

రాజస్థాన్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన సచిన్ వర్గం..
Follow us on

రాజస్థాన్‌ రాజకీయాలు మరింత హాటెక్కాయి. డిప్యూటీ సీఎం పదివితో పాటు పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి సచిన్ పైలట్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచిన్ పైలట్‌ వర్గం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏకంగా రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలోని సచిన్ పైలట్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సవాయ్ మాదోపూర్‌ ప్రాంతంలో పైలట్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. అశోక్ గెహ్లాట్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతేకాదు.. పార్టీలో పలు కీలక పదవుల్లో ఉన్న నేతలు సచిన్ పైలట్‌కు మద్దతు ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పలు జిల్లాల అధ్యక్షుటు పార్టీకి రాజానామా చేస్తూ వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సచిన్ పైలట్‌ వర్గం మంత్రులను ఇద్దర్ని తొలగించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఇక సచిన్ వర్గం దాదాపు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పబోతున్నట్లు
సంకేతాలు అందాయి. మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఇక బలప్రదర్శన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. అయితే అశోక్‌ గెహ్లాట్ మాత్రం తమ ప్రభుత్వానికి కావాల్సిన బలం ఉందని చెబుతున్నారు.