‘పాక్ గూడచార పావురమా’? అబ్బే ! వదిలేశారు !

| Edited By: Pardhasaradhi Peri

May 30, 2020 | 1:56 PM

అందంగా, కలర్ ఫుల్ గా, వెరైటీగా కనిపిస్తున్న పావురం  ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో కనబడింది. పైగా దాని కాలికి కట్టి ఉన్న ఓ చిన్న ట్యాగ్ పై యేవో నెంబర్లు ఉన్నాయని, అవి పాక్ ఉగ్రవాదుల కోడ్ నెంబర్లే అయి ఉంటాయని..

పాక్ గూడచార పావురమా? అబ్బే ! వదిలేశారు !
Follow us on

అందంగా, కలర్ ఫుల్ గా, వెరైటీగా కనిపిస్తున్న పావురం  ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో కనబడింది. పైగా దాని కాలికి కట్టి ఉన్న ఓ చిన్న ట్యాగ్ పై యేవో నెంబర్లు ఉన్నాయని, అవి పాక్ ఉగ్రవాదుల కోడ్ నెంబర్లే అయి ఉంటాయని దేశవ్యాప్తంగా వార్తలొచ్చాయి. ఇంకేం ? పాకిస్తాన్ మన దేశం మీదికి ఇలా గూఢచార పావురాలను వదులుతోందని అంతా భావించి కంగారు పడ్డారు. అయితే  దీని యజమానిని తనేనని చెప్పుకున్న పాక్ వాసి హబీబుల్లా.. దయ చేసి తన ‘అమాయక పక్షిని’ వదిలేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుకున్నాడు. దీని కాలికి కట్టి ఉన్న ట్యాగ్ లోని నెంబర్లు తన మొబైల్ ఫోన్ నెంబర్లని క్లారిటీ ఇచ్చాడు. ఇన్ని రోజులూ ఈ పావురాన్ని, దీని కాలికి కట్టి ఉన్న చీటీ ముక్కని ‘నఖశిఖ’ పర్యంతం పరిశీలించిన అధికారులు.. ఇందులో అనుమానించదగినదేమీ లేదని నిర్ధారించి ఈ నెల 27 వ వదిలివేశారు. అది ఎక్కడ కనబడిందో అక్కడే దీనికి విముక్త్జి కల్పించారు. అన్నట్టు.. తన పక్షి.. పావురాల రేసింగ్ లో కూడా పాల్గొన్నదని  హబీబుల్లా తెలిపాడట. స్వేఛ్చ పొందిన ఈ పావురం దాని యజమానిని చేరిందో లేదో ఇంకా తెలియదు.

ఏమైనా… భారత, పాక్ సరిహద్దుల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటున్న మన జవాన్లు.. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ వేసి ఉసూరుమంటున్నారు.