వామ్మో.. మీకు కూడా ఈ మెసేజ్ వచ్చిందా.. టచ్ చేస్ ఏమవుతుందో తెలుసా..?

ఈ డిజిటల్ యుగంలో కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో డబ్బు దోచుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, కేవైసీ పేరు చెప్పి ప్రజల డబ్బు దోచేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇండియా పోస్ట్ పార్సెల్ డెలివరీ పేరుతోనూ మోసాలకు దిగారు. "మీ అడ్రస్ సరిగా లేదు, 48 గంటల్లో అప్‌డేట్ చేయండి" అంటూ వచ్చిన మెసేజ్ వెనుక దాగి ఉన్న పెద్ద ప్రమాదం ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వామ్మో.. మీకు కూడా ఈ మెసేజ్ వచ్చిందా.. టచ్ చేస్ ఏమవుతుందో తెలుసా..?
India Post Sms Scam

Updated on: Oct 13, 2025 | 6:43 PM

ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రకరకాల మోసాలతో కేటుగాళ్లు ప్రజల డబ్బు కొట్టేస్తున్నారు. ఫేక్ లింక్స్, డిజిటల్ అరెస్ట్ వంటి వాటితో భయపెట్టి డబ్బు లూటీ చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ పథకాల పేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. కేవైసీతో పాటు ఈ లింక్ క్లిక్ చేసి పథకానికి అప్లై చేసుకోండి, ఒక్క క్లిక్‌తో నిధులు మీ అకౌంట్‌‌లో పడతాయంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

మీకు ఒక మెసేజ్ వచ్చిందా.. అందులో, మీ పార్సల్ అడ్రస్ సరిగా లేదు, 48 గంటల్లో అప్‌డేట్ చేయకపోతే వెనక్కి పంపేస్తాం అని ఉందా..? అయితే ఒక్క నిమిషం ఆగండి ఇండియా పోస్ట్ పేరుతో వస్తున్న ఈ మెసేజ్ అస్సలు నిజం కాదు, పూర్తిగా ఫేక్.. ప్రజలను భయపెట్టి తొందరగా ఆ లింక్‌పై క్లిక్ చేసేలా చేయడమే మోసగాళ్ల ప్లాన్. ఈ మెస్సేజ్‌తో పాటు కింద ఒక లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే అవకాశం ఉంది.

ఈ మెసేజ్ గురించి ప్రభుత్వ సంస్థ PIB పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇండియా పోస్ట్ ఎప్పుడూ కూడా అడ్రస్ అప్‌డేట్ చేయమని ఇలాంటి SMSలను పంపదని తెలిపింది. ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌పై అస్సలు క్లిక్ చేయకండి! క్లిక్ చేస్తే మీ ఫోన్ వివరాలు దొంగిలించబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎవరైనా ఇండియా పోస్ట్ పేరు చెప్పి ‘అడ్రస్ మార్చండి’ అంటూ మెసేజ్ పంపితే.. అది నూరు శాతం మోసమే.. వెంటనే ఆ మెసేజ్‌ను డిలీట్ చేయండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..