RBI Clean Note Policy: కరెన్సీ నోట్లపై పెన్నుతో రాస్తే చెల్లుబాటు అవ్వవా? వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో నిజమెంత?

|

Jan 08, 2023 | 9:44 PM

PIB Fact Check: ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుందా? 100, 200, 500, 2000 కరెన్సీ నోట్లపై పెన్నుతో రాయడం వల్ల అది చెల్లుబాటు అవ్వదా? అలా రాస్తే అది చిత్తు కాగితం కింద లెక్క కడతారా?

RBI Clean Note Policy: కరెన్సీ నోట్లపై పెన్నుతో రాస్తే చెల్లుబాటు అవ్వవా? వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌లో నిజమెంత?
Currency Notes
Follow us on

ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుందా? 100, 200, 500, 2000 కరెన్సీ నోట్లపై పెన్నుతో రాయడం వల్ల అది చెల్లుబాటు అవ్వదా? అలా రాస్తే అది చిత్తు కాగితం కింద లెక్క కడతారా? ఆర్బీఐ వాటిని డీఫేజ్ చేస్తుందా? ఆర్బీఐ నూతన మార్గదర్శకాల ప్రకారం కొత్త నోట్లపై ఏమైనా రాస్తే అవి చెట్టుబాటు అవ్వవా? ఇవే వివరాలతో కూడిన మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. అది చూసి జనాలు హడలిపోతున్నారు. ఆ సందేశం నిజమేనేమో అని కంగారుపడిపోతున్నారు. అయితే, ఈ మెసేజ్‌లో వాస్తవం ఎంత అనేది తేల్చేసింది పీఐబీ ఫ్యాక్ట్ చెక్. అసలు నిజాన్ని లోకానికి చాటిచెప్పింది పీఐబీ. ఆ మెసేజ్ అంతా పచ్చి అబద్ధం అని తేల్చింది. రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 20 నోట్లపై ఏం రాసి ఉన్నా అది చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు పిఐబి ఫ్యాకెట్ ట్వీట్ చేసింది. వైరల్ అవుతున్న మెసేజ్ నిజం కాదని స్పష్టం చేసింది. అయితే, ఆర్‌బిఐ క్లీన్ నోట్ పాలసీ ప్రకారం.. ప్రజలు కరెన్సీ నోట్లపై రాయొద్దని కోరింది. అలా రాయడం వల్ల కరెన్సీ నోట్ జీవితకాలం తగ్గుతుందని, అందుకే వాటిపై ఎలాంటి రాతలు రాయొద్దని పేర్కొంది. అలాగని రాస్తే చెల్లుబాటు కాకుండా ఉండవని కూడా పేర్కొంది. సాధారణంగా ప్రజలు కరెన్సీ నోట్లను దండలు, బొమ్మల తయారీకి, ఉత్సవాల సందర్భంలో పండల్‌లు, ప్రార్థనా స్థలాలను అలంకరించడానికి, సామాజిక కార్యక్రమాల్లో వ్యక్తులపై వర్షంలా కురిపించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వలన కరెన్సీ నోట్లు క్షీణిస్తాయి. వాటి లైఫ్ తగ్గుతుంది.

ఇక చిరిగిపోయిన, పాతబడిన కరెన్సీ నోట్లను బ్యాంకుల టెల్లర్ కౌంటర్లలో ఉచితంగా మార్చుకునే సదుపాయం ఉంది. ఈ అవకాశాన్ని ఆర్బీఐ కలిపించింది. నాణెలు, చిన్న నోట్లను కూడా బ్యాంకుల్లో ఉచితంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం.. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకుల శాఖల్లో పాతబడిన కరెన్సీ నోట్లు, నాణెలను మార్చుకోవచ్చు. అయితే, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులలో నోట్లను మార్చుకోవడం అనేది ఐచ్ఛికం అని ఆర్బీఐ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..