ఆ కంపెనీలు మనకు నేరుగా వ్యాక్సిన్లు ఇవ్వరట, అందుకే కేంద్రాన్ని పదేపదే కోరుతున్నా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , త్వరపడాలని అభ్యర్థన

| Edited By: Anil kumar poka

May 24, 2021 | 4:57 PM

వ్యాక్సిన్ల కొరతను తీర్చేందుకు తాను ఫైజర్, మోడెర్నా టీకామందుల తయారీ సంస్థలతో మాట్లాడానని, కానీ నేరుగా వాటిని అమ్మబోమని చెప్పారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు...

ఆ కంపెనీలు మనకు నేరుగా వ్యాక్సిన్లు ఇవ్వరట,  అందుకే కేంద్రాన్ని పదేపదే కోరుతున్నా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , త్వరపడాలని అభ్యర్థన
Pfizer, Moderna Won't Sell Shots Directly To Us Says Delhi Cm Arvind Kejriwal
Follow us on

వ్యాక్సిన్ల కొరతను తీర్చేందుకు తాను ఫైజర్, మోడెర్నా టీకామందుల తయారీ సంస్థలతో మాట్లాడానని, కానీ నేరుగా వాటిని అమ్మబోమని చెప్పారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తాము కేంద్ర ప్రభుత్వంతోనే సంప్రదిస్తామని ఆ సంస్థలు చెప్పాయని ఆయన వెల్లడించారు. ఈ కారణంగానే ఈ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేంద్రాన్ని పదేపదే కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. తమకు నేరుగా టీకామందులను సరఫరా చేయాలన్న పంజాబ్ అభ్యర్థనకు మోడెర్నా తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇదే మాట అంటున్నారు. దేశంలోని అన్ని వ్యాక్సిన్ సంస్థలతో కేంద్రం సంప్రదించి డోసులను పెంచాలని తాను కోరుతున్నట్టు ఆయన వెల్లడించారు. నేను ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశానని, కానీ ఆ లేఖకు సమాధానం రాలేదని ఆయన చెప్పారు. కనీసం 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సిన్ ఇవ్వలేకపోయినా ఇతర వయస్సుల వారికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన చెప్పారు. మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య విరామ కాలం ఎక్కువగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్న దృష్ట్యా వివిధ కంపెనీలు టీకామందుల ఉత్పత్తిలో జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని విదేశీ కంపెనీలను ప్రభుత్వం అనుమతించాలని అయన మళ్ళీ విజ్ఞప్తి చేశారు.

చాలా దేశాలు తమకు అవసరమైనదానికన్నా ఎక్కువగా టీకామందులను నిల్వ చేసుకుంటున్నాయని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అందువల్లే వాటిని మనదేశం కొనుగోలు చేయాలని అభ్యర్థిస్తున్నా అని అన్నారు. కోవిద్ కేసులు తగ్గినప్పటికీ వ్యాక్సినేషన్ ఎంతయినా అవసరమని ఆయన చెప్పారు.

మరిన్ని చదవండి ఇక్కడ : 
police brutality on dalit youth….దళితుడికి పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు, మంచి నీరు అడిగితే ఖాకీలు ఏం చేశారంటే ..? కర్నాటకలో దారుణం
Viral Video: ఈ కాకి ముక్కు ఎంత పదునో… చెట్టుకు ఎంత పెద్ద బొక్క పెట్టింది చూడండి… ( వీడియో )