
ఓ బ్యాంక్ మేనేజర్ మిస్సైనట్టు పోలీసులకు ఫిర్యాదు వచ్చిన రెండు రోజు తర్వాత అతని మృతదేహం ఓ బావిలో దొరకడం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది పట్నాకు చెందిన ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ వరుణ్‌ది గుర్తించారు. ఈ ఘటన పాట్నాలోని బియుర్ ఏరియాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాకు చెందిన అభిషేక్ వరుణ్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా ఉద్యోగం చేసేస్తున్నాడు. అయితే జూలై 13వ తేదీన అతనను కనిపించకుండా పోయిన ముందు రోజు రాత్రి అతను తన ఫ్యామితో కలిసి రామకృష్ణ నగర్ ప్రాంతంలో ఒక పంక్షన్‌కు వెళ్లాడు. అయితే అతని భార్య, పిల్లలు రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి రాగా, వరుణ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు.
తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో, అతను తన భార్యకు ఫోన్ చేసి, తనకు ప్రమాదం జరిగిందని చెప్పాడని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన కొద్దిసేపటికే, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అతను ఎక్కడున్నాడనే విషయం కూడా చెప్పలేదు. దీంతో కంగారు పడిపోయిన అతని భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వరుణ్ భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతను వెళ్లిన ఫంక్షన్ హాల్ పరిసరాల్లోని సీసీకెమెరా దృశ్యాలను పరిశీలించారు. వాటిలో అతను రాత్రి 10:48 గంటలకు ఒంటరిగా తన స్కూటర్‌పై వెళుతున్న దృశ్యాలు కనిపించాయి, అందులో అతను మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించాడు. దీంతో అతని కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇక మరుసటి రోజు ఉదయం పాట్నాలోని బియుర్ ఏరియాలో ఉన్న ఒక బావిలో స్కూటర్‌తో పాటు ఉన్న ఒక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కిడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పరీక్షించగా అది కనిపించకుండా పోయిన బ్యాంక్ మేనేజర్ వరుణ్‌దిగా గుర్తించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతని చెప్పులను కూడా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక దర్యాప్తులో భాగంగా వరుణ్ మరణానికి గల ఖచ్చితమైన ఆధారాలు గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు ముగిసిన తర్వాత అతని మరణానికి కారణం తెలుస్తుందని డీఎస్పీ ఫుల్వారీ షరీఫ్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.