
‘పాస్‌పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. భారత పాస్‌పోర్ట్ కేవలం ఒక ప్రయాణ పత్రం (ట్రావెల్ డాక్యుమెంట్) మాత్రమేనని, అది పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో సామాన్య ప్రజల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. పాస్‌పోర్ట్‌లు, ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పౌరసత్వానికి అంతిమ రుజువు కాకపోతే, మరి అసలైన పౌరసత్వ రుజువు ఏది? చట్టం ఏం చెబుతోంది? అనే అంశాలపై గందరగోళం నెలకొంది.
పాస్‌పోర్ట్ చట్టం, కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి?
పాస్‌పోర్ట్ కలిగి ఉండటం అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా భారత పౌరుడే అని చెప్పడానికి వీల్లేదని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అవసరమని భావిస్తే, భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చు. అంటే, చట్టపరంగా పాస్‌పోర్ట్, పౌరసత్వం వేర్వేరు. ఇదే అంశాన్ని 2013లో బాంబే హైకోర్టు సైతం ఒక తీర్పులో సమర్థించింది. పాస్‌పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని భారత పౌరుడిగా నిశ్చయాత్మకంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
పౌరసత్వ చట్టం 1955 ఏం చెబుతోంది?
భారత పౌరసత్వాన్ని నిర్ధారించే ఏకైక చట్టపరమైన ఆధారం ‘1955 పౌరసత్వ చట్టం’. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 5 మార్గాల్లో పౌరసత్వం లభిస్తుంది:
అసలైన రుజువు పత్రం ఏది?
పై ఐదు ప్రక్రియల ద్వారా ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ‘పౌరసత్వ ధృవీకరణ పత్రం’ (Citizenship Certificate) మాత్రమే భారత పౌరసత్వానికి అసలైన, అంతిమ చట్టపరమైన రుజువు. మనం నిత్యం వాడే పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ వంటివన్నీ కేవలం దేశంలో నివసించడానికి, ప్రభుత్వ సేవలు పొందడానికి ఉపయోగపడే ‘గుర్తింపు, చిరునామా పత్రాలు’ (Identity & Address Proofs) మాత్రమే కానీ, అవి పౌరసత్వ ధృవీకరణ పత్రాలు కావు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..