Pariksha Pe Charcha 2025: తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్దకూడదు.. పరీక్ష పే చర్చలో మోదీ

Pariksha Pe Charcha 2025: బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10, 2025న దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ‘పరీక్ష పే చర్చ’ 8వ ఎడిషన్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో..

Pariksha Pe Charcha 2025: తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్దకూడదు.. పరీక్ష పే చర్చలో మోదీ

Updated on: Feb 10, 2025 | 1:44 PM

తల్లిదండ్రులు తమ పిల్లలను మోడల్స్‌గా ప్రదర్శించవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పిల్లలతో ముచ్చటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇతర పిల్లల్లాగే ఉండేలా చూడాలని, మీ పిల్లలు వారికి అత్యంత ఆసక్తి ఉన్న అంశాల గురించి చదివేలా చేయాలని మోదీ సూచించారు. పిల్లలు తమ ఆసక్తులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, అందరితో బహిరంగంగా మాట్లాడాలని, తల్లిదండ్రులు తమ సమస్యలను పిల్లలపై రుద్దకూడదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ప్రతి పిల్లలు ఏదో ఒక రంగంలో రాణిస్తారని అన్నారు.

మీరు ప్రధానమంత్రి కాకపోతే, మంత్రి అయితే, ఏ శాఖను ఎంచుకుంటారు? అని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం ఇచ్చారు. “నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి నేను నైపుణ్యాల విభాగాన్ని ఎంచుకుంటాను అని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నైపుణ్యాలపై దృష్టి పెట్టాలన్నారు. పిల్లలు అలసిపోతే పరీక్షల్లో బాగా రాయగలరా? అని అన్నారు.

మనం రోబోలము కాదు, మనుషులం. పిల్లలను నాలుగు గోడల మధ్య బంధించి పుస్తకాల చెరసాలలో వేస్తే, వారు ఎప్పటికీ ఎదగలేరు అని ప్రధానమంత్రి అన్నారు. వారికి బహిరంగ ఆకాశం కల్పించాలని, స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని అన్నారు.

ఈ సంవత్సరం ‘పరీక్ష పే చర్చ’ ఢిల్లీలోని సుందర్ నర్సరీలో నిర్వహించారు. పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులను విముక్తి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కార్యక్రమం లక్ష్యం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, వారి ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, వారు ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరేపించడమే ప్రధాన ఉద్దేశం.


ఇది కూడా చదవండి: Pariksha Pe Charcha: పరీక్షాపే చర్చలో విద్యార్థులతో ప్రధాని మోదీ.. వీడియో షేర్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి