Pan Card Loan Cheating: మీ పాన్ కార్డ్ దుర్వినియోగమైందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి..!

|

Apr 11, 2022 | 6:55 AM

Pan Card Loan Cheating: వ్యక్తికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ద్రుపపత్రాలలో పాన్ కార్డు కూడా ఒకటి. వ్యక్తులకు సంబంధించిన ఏ లావాదేవిలు

Pan Card Loan Cheating: మీ పాన్ కార్డ్ దుర్వినియోగమైందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి..!
Pan Card
Follow us on

Pan Card Loan Cheating: వ్యక్తికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ద్రుపపత్రాలలో పాన్ కార్డు కూడా ఒకటి. వ్యక్తులకు సంబంధించిన ఏ లావాదేవిలు జరుపాలన్నా పాన్ తప్పనిసరి. అయితే, ఈ పాన్ కార్డ్ ఇటీవలి కాలంలో ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. దాంతో అసలైన వ్యక్తులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సిబిల్ స్కోర్ తగ్గడం, రిమార్క్స్ రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. పాన్ కార్డ్ కలిగిన వ్యక్తికి తెలియకుండానే.. మోసగాళ్లు వారి పేరిట రుణాలు తీసేసుకుంటున్నారు. మీ వద్ద కూడా పాన్ కార్డ్ ఉంటే.. మీ కార్డు దుర్వినియోగం అయ్యిందా? లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోవడం ఉత్తమం. మరి ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

CIBIL స్కోర్‌ని చెక్ చేయండి..
CIBIL స్కోర్‌ని చెక్ చేయడం సులభమైన మార్గం. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల CIBIL, Equifax, Experian, CRIF హై మార్క్ ద్వారా చెక్ చేయవచ్చు. CIBIL స్కోర్‌ని చెక్ చేయడం ద్వారా.. మీ పేరు మీద మీకు ఏదైనా లోన్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు.

Paytm ద్వారా..
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు. మీ పాన్ కార్డ్‌పై ఏదైనా లోన్ ఉందా? లేదా? అనేది Paytm, పాలసీ బజార్ వంటి ఏదైనా ప్లాట్‌ఫారమ్ నుండి కనుగొనవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో, ఆర్థిక నివేదికలను చెక్ చేసే ఎంపికను పొందుతారు. ఇక్కడ నుండి మీ CIBIL స్కోర్, లోన్ వివరాలను సులభంగా కనుగొనవచ్చు.

ఫారమ్ 26A చెక్ చేయండి..
మూడవ మార్గం ఫారమ్ 26A చెక్ చేయడం. అంటే, మీ పాన్ కార్డ్‌పై మరెవరైనా లోన్ తీసుకున్నారా లేదా అనేది ఫారమ్ 26A నుండి కూడా చెక్ చేయవచ్చు. ఇది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే వార్షిక పన్ను ప్రకటన. ఇందులో మీ ఆదాయపు పన్ను రిటర్న్ రికార్డులు, మీ పాన్ కార్డ్ ద్వారా జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి. ఈ విధంగా మీ పాన్ కార్డ్‌పై మరెవరైనా లోన్ తీసుకున్నారో లేదో తెలుసుకోవచ్చు.

Also read:

Food Coma: రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతున్నారా.. అయితే మీరు వీటిన తినడం మానేయాలి.. లేకుంటే ప్రమాదమే

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..