AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హై అలర్ట్: భారత్‌లోకి ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు.. ఎలా వచ్చారంటే!

ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో ఉగ్రకలకలం రేగింది. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్డట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో అలర్టైన్‌ బిహార్‌ పోలీసులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు జైషేమహ్మద్‌ ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు, వివరాలను విడుదల చేసింది. వీరు నేపాల్‌ సరిహద్దు గుండా బిహార్‌లోకి ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు.

హై అలర్ట్: భారత్‌లోకి ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు.. ఎలా వచ్చారంటే!
Bihar On High Alert
Anand T
|

Updated on: Aug 28, 2025 | 9:24 PM

Share

పాకిస్తాన్ నుండి ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్ గుండా బీహార్‌లోకి ప్రవేశించారని సమాచారం అందడంతో బీహార్ అంతటా హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించబడిందని గురువారం ఒక అధికారి తెలిపారు. దీంతో అలర్టైన్‌ బిహార్‌ పోలీసులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు అన్ని జిల్లా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశంపై బీహార్ డిజిపి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నేపాల్‌ సరిహద్దు గుండా రాష్ట్రంలోకి చొరబడినట్టు తెలిపారు. ఈ మేరకు ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు, వివరాలను విడుదల చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విభాగాల పోలీసులు అలర్ట్‌లో ఉన్నారని.. దేశ వ్యతిరేక శక్తులు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా అడ్డుకునేందుకు తాము అన్ని కార్యకాలపాలను సిద్ధం చేశామని తెలిపారు.

అయితే రాష్ట్రంలోకి చొరబడిన ఉగ్రవాదులను హస్నైన్‌ అలీ (రావల్పిండి), ఆదిల్‌ హుస్సేన్‌ (ఉమర్‌కోట్‌), మహ్మద్‌ ఉస్మాన్‌ (బహవల్‌పూర్‌)గా నిఘా వర్గాలు గుర్తించాయి. వీళ్లంగా పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నెల రెండోవారంలో పాకిస్తాన్‌ నుంచి కాఠ్‌మాండూకు చేరుకున్న ఈ ఉగ్రవాదులు గతవారం బిహార్ లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ ఉగ్రవాదలు ఫొటోలు, ఇతర వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపామని తెలిపారు.

అయితే ఈ ముగ్గురి ఉగ్రవాదులపై రికార్డు కూడా ప్రకటించినట్టు పోలీసులు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఎవరైనా అనుమానంగా కనిపించినా.. ఈ ఫోటోల ఉన్న వ్యక్తులను గుర్తించిన సమాచారం ఇచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఉగ్రవాధులకు సంబంధించిన సమాచారం అందజేసిన, వారి అరెస్టుకు సహకరించిన వారికి రూ. 50,000 నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు ఫోన్ నంబర్లు 112 లేదా 9431822988, 9031827100 ద్వారా సమాచారం అందించవచ్చు” అని తూర్పు చంపారన్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.