India-Pakistan: కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్‌.. భారత ఆర్మీకి కీలక ఆదేశాలు.. విక్రమ్‌ మిస్రీ సంచలన ప్రెస్‌మీట్..

కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ తన వక్రబుద్ధిని చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌లో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు దిగింది.

India-Pakistan: కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్‌.. భారత ఆర్మీకి కీలక ఆదేశాలు.. విక్రమ్‌ మిస్రీ సంచలన ప్రెస్‌మీట్..
Vikram Misri

Updated on: May 10, 2025 | 11:31 PM

కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ తన వక్రబుద్ధిని చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతోంది. శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌లో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బాడ్‌మేర్‌లలో పూర్తిగా విద్యుత్‌ నిలిపివేశారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని.. భారతదేశం తగిన విధంగా స్పందిస్తోందని విదేశాంగ కార్యదర్శి కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు.

ఎల్‌వోసీ దగ్గర పాక్‌ కాల్పులు జరిపిందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పేర్కొన్నారు. కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తోందన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘించడం సరికాదు.. తాజా పరిణామాలను ఆర్మీ నిశితంగా గమనిస్తోందని తెలిపారు. సైనికులు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా.. పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని.. భారత ఆర్మీకి కీలక ఆదేశాలు ఇచ్చామని విక్రమ్‌ మిస్రీ తెలిపారు.

వీడియో చూడండి..

ఈ క్రమంలోనే.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ రాత్రి 11 గంటల సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారతదేశం, పాకిస్తాన్ DGMO ల మధ్య ఈ సాయంత్రం ఒక అవగాహన కుదిరింది. ఈ క్రమంలోనే గత కొన్ని గంటలుగా, ఈ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. భారత సైన్యం ఈ సరిహద్దు చొరబాటుకు ప్రతీకారం తీర్చుకుంటోంది.. దానిని భారత్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ చొరబాటు చాలా ఖండించదగినది.. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహిస్తుంది. పాకిస్తాన్ ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని, ఈ చొరబాటును ఆపడానికి వెంటనే తగిన చర్య తీసుకోవాలని మేము విశ్వసిస్తున్నాము.” అని మిస్రీ పేర్కొన్నారు.