Oxygen Shortage in Maharashtra: మహారాష్ట్రలో విపత్కర పరిస్థితులు.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత..

|

Apr 07, 2021 | 10:10 AM

Maharashtra Covid-19: మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ..

Oxygen Shortage in Maharashtra: మహారాష్ట్రలో విపత్కర పరిస్థితులు.. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత..
Oxygen Shortage In Maharashtra
Follow us on

Maharashtra Covid-19: మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల కొర‌త ఏర్పడింది. దీంతోపాటు.. పూణే న‌గ‌రంలోని ఆసుపత్రుల్లో రోగులకు బెడ్లు సరిపోని విధంగా లేక‌పోవ‌డంతో కోవిడ్ బాధితులు బయట చికిత్స పొందుతున్నారు. దీంతో త‌మ రాష్ర్టానికి ఆక్సిజ‌న్ సిలిండర్లను స‌మ‌కూర్చాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌కు మ‌హారాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే విన్నవించారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన కొంద‌రి ఆరోగ్య ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని, వీలైనంత త్వరగా వేరే రాష్ట్రాల నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను సమకూర్చాలని తోపే కోరారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటం, విపత్కర పరిస్థితులు తలెత్తుతుండటంతో ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురవుతుంది.

ఇదిలాఉంటే.. మహారాష్ట్రలో క‌రోనావైర‌స్ విజృంభ‌ణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంట‌ల్లో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 55,469 కేసులు నమోదు కాగా.. 297 మంది మరణించారు. వీటతో కలిపి ఇప్పటివరకు 31,13,354 కేసులు నిర్థారణ కాగా… మరణాల సంఖ్య 56,330 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,72,283 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ముంబై, పూణేలో నిత్యం భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

Coronavirus: భారత్‌లో కరోనా విజృంభణ.. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. 16మంది మృతి, 14మందికి గాయాలు