సోపోర్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

| Edited By:

Jul 12, 2020 | 5:44 PM

జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు.ఈ సంఘటన సోపోర్‌లోని రెబ్బన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం..

సోపోర్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
Follow us on

జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు.ఈ సంఘటన సోపోర్‌లోని రెబ్బన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు రెబ్బన్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఎన్‌కౌంటర్‌ జరిగిన చోటు నుంచి మరికొందరు ఉగ్రవాదులు పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, గత నెల జూన్‌ 25వ తేదీన ఇదే ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. అప్పుడు ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది.