ప్లాస్టిక్ వ్యర్థాలతో లక్ష కిలోమీటర్ల రోడ్డు పూర్తి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో లక్ష కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలను ఆదా చేసిన భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్లాస్టిక్ వ్యర్థాలతో లక్ష కిలోమీటర్ల రోడ్డు పూర్తి.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 4:14 PM

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో లక్ష కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలను ఆదా చేసిన భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో లక్ష కిలోమీటర్ల మేర దేశవ్యాప్తంగా ప్లాస్టిక్​ రోడ్లు వేయాలని నిర్ణయించుకుంది. కాగా 2016లో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్డు నిర్మాణాన్ని చేపడతామని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ క్రమంలో 11 రాష్ట్రాల్లో లక్ష కిలోమీటర్ల రోడ్డును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇక కిలోమీటరు రహదారిని వేయడానికి తొమ్మిది టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడింది.

అయితే సాధారణంగా మామూలు రోడ్లలో కిలోమీటరుకు పది టన్నుల తారును వాడుతుంటారు. ఒక టన్ను తారుకు సరాసరి 30 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. అయితే టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించడం వల్ల, లక్ష కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కాగా ప్లాస్టిక్ రోడ్లలో సహజంగా 6 నుంచి 8 శాతం ప్లాస్టిక్, 92 నుంచి 94 శాతం తారు ఉంటుంది.

Latest Articles